పశ్చిమగోదావరి

పోలీసుల వలయంలో గరగపర్రు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జన్ 25: అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో ఏర్పడిన వివాదం చిలికి చిలికిగాలివానలా మారింది. సుమారు మూడు మాసాల క్రితం గ్రామంలో ఒక వర్గం అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తుండగా మరోవర్గం దానిని అడ్డుకుంది. దీంతో గ్రామంలో ఈ వివాదం తారస్థాయికి చేరింది. ఆ తర్వాత సైలెంట్‌గా ఉన్నప్పటికీ కొద్ది రోజుల క్రితం నుంచి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుచేసుకుంటున్న వారిని వెలివేసారని ఆ బాధితులు జిల్లా కలెక్టర్ కాటంనేని బాస్కర్ నుంచి ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీని కలిశారు. దీంతో ఒక్క సారిగా ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. గ్రామానికి వచ్చిన కలెక్టర్ కాటంనేని భాస్కర్, సబ్ కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీలు అక్కడ పరిస్థితులు పరిశీలించారు. అదే విధంగా మాజీ ఎంపి హర్షకుమార్ , ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు వారిని పరామర్శించారు. ఇక తాజాగా ఆదివారం బిజెపి దళిత మోర్చా జిల్లా కన్వీనర్ బూసి సురేంద్ర నాధ్ బెనర్జి రాష్టస్థాయి నాయకులు అక్కడకు వెళ్లినవారిని పోలీసులు అడ్డుకున్నారు. అదే విధంగా కాంగ్రెస్‌కు జెందిన మాజీ మంత్రి శైలజానాథ్, కోండ్రు మురళి, వైసిపి కన్వీనర్ పాతపాటి సర్రాజులను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా బాధితుల డిమాండ్ మేరకు ఇందుకూరి బలరామరాజు, రామరాజు, శ్రీనివాస్‌లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అదే విధంగా సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రివిలేజ్ కమిటీని ఏర్పాటుచేశారు.