పశ్చిమగోదావరి

మార్పు వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు/ద్వారకాతిరుమల)
హిందూసమాజంలో మార్పు వస్తోందని, అయితే మరింత మార్పు అవసరమన్న అభిప్రాయాన్ని బిజెపి ఎంపి సుబ్రహ్మణ్యస్వామి వ్యక్తం చేశారు. దాదాపు 33 ఏళ్ల తర్వాత దేశప్రజలు ఏకపార్టీ పాలనవైపు ముక్తకంఠంతో మొగ్గు చూపారని, అదే రానున్న ఎన్నికల్లో మరో పదిశాతం ఓట్లు పెరిగితే మూడింట రెండువంతుల మెజార్టీ వస్తుందని చెప్పారు. దానివల్ల రాజ్యాంగంలో మనకు అవసరమైన మార్పులు చేసుకునే వీలు ఉంటుందని, అంతకుమించి దేశాన్ని కూడా సమూలంగా సంస్కరించే అవకాశం లభిస్తుందని చెప్పారు. ద్వారకాతిరుమలలోని శ్రీ శేషాచల కొండపై మాధవ కళ్యాణమండపంలో శని,ఆదివారాల్లో నిర్వహించిన అంతర్జాతీయ హిందూ ధార్మిక సమ్మేళనం ఆదివారం విజయవంతంగా ముగిసింది. చివరిరోజైన ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రధానవక్తగా పాల్గొన్న బిజెపి ఎంపి సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ అయోధ్య రామాలయానికి సంబంధించిన పలు అంశాలను వివరించారు. దీపావళినాటికిగాని, వచ్చే ఏడాదికిగాని ఆయోధ్యలో పూరిస్థాయి రామాలయం అవిర్భవిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇంతకుముందు టిటిడికి సంబంధించి జరిగిన అంశాలను వివరిస్తూ ఆదికేశవులనాయుడు ఛైర్మన్‌గా ఉన్న సమయంలో ఆలయాన్ని స్వర్ణమయం చేసేందుకు ఒక పధకాన్ని ప్రవేశపెట్టారని, అయితే అర్చకస్వాములు తన దృష్టికి ఈ అంశాన్ని తీసుకువచ్చి దానివల్ల ఆలయగోడలపై పూర్వకాలం నుంచి ఉన్న శాసనాలు కనుమరుగవుతాయని చెప్పారన్నారు. అదే అంశాన్ని తాను టిటిడి ఛైర్మన్‌ను ప్రశ్నించగా శాసనాలన్నింటిని వీడియో తీసి ఉంచుతానని సమాధానం ఇచ్చారని, అయితే పూజలు, పునస్కారాలు, ఇతర అంశాలను కూడా వీడియో తీసి ఉంచితే భక్తులు ఎవరి ఇళ్లల్లో వాళ్లు అవిచూసి తరిస్తారని చెప్పానని పేర్కొన్నారు. చివరకు న్యాయస్ధానం జోక్యంతో ఆ పధకానికి మంగళం పాడాల్సి వచ్చిందని వివరించారు. తిరుమల-తిరుపతిని ప్రభుత్వం 1933లో స్వాధీనం చేసుకుందని, అంటే ఇప్పటికి ఎన్ని దశాబ్దాలు గడిచిపోయాయో అర్దమవుతుందన్నారు. ఎక్కడైనా నిధుల అవకతవకలు జరిగితే ప్రభుత్వ జోక్యం అవసరం తప్ప మిగిలిన సమయాల్లో ఈ జోక్యం అనవసరమని చెప్పారు. ఆలయాలను అయిదేళ్లకు మించి ప్రభుత్వ ఆధీనంలో ఉంచకూడదన్న అంశంపై న్యాయస్ధానంలో విచారణ జరుగుతోందని, అది కొలిక్కి వస్తే ఆలయాలన్నింటికి ప్రభుత్వం నుంచి విముక్తి లభిస్తుందన్నారు. అయితే ఇదే అంశం తిరుమల-తిరుపతి విషయంలోనూ సందిగ్ధం సృష్టించిందని, ఆలయాన్ని ప్రభుత్వపరిధి నుంచి తప్పిస్తే ఎవరికి అప్పగించాలన్న అంశం తెరపైకి వచ్చిందని, అప్పట్లో హథీరాంజీ వర్గానికి ఇవ్వాలని సూచించినా దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయన్నారు. దీంతో ఆ వ్యవహారం కొలిక్కిరాలేదని, ఈనేపధ్యంలో హిందూ సమాజంలో ఐక్యత మరింతగా రావాల్సిన అవసరం ఉందని, ఆలయాన్ని ఎవరికి అప్పగించాలని అన్న విషయంలోనూ స్పష్టత లేకపోతే ప్రభుత్వం ఆ అంశాన్ని వినియోగించుకుంటుందన్నారు. దేశంలో ఎక్కడ చూసినా మైనార్టీలు అధికంగా ఉన్నచోట్ల ప్రజాస్వామ్యం మనగలగలేకపోవటం చూడవచ్చునని, అదే అంశం కాశ్మీర్ లోయ నుంచి అన్నిచోట్ల స్పష్టమవుతోందని చెప్పారు. ఈవిషయంలో ప్రభుత్వాలు, రాజాధినేతలు మరింత స్పష్టంగా ఉండగలిగితే పరిస్దితిని మార్చవచ్చునని, ఆస్ట్రేలియాలో ముస్లింలు తమ వ్యవహారాలు నడిపించుకునేందుకు ప్రభుత్వం అంగీకరించాలని అక్కడి ప్రధానిని కోరితే దానికి ఆయన అంగీకరించకుండా ఇక్కడ అమలులో ఉన్న యూనిఫామ్ సివిల్‌కోడ్ పరిధిలోనే కొనసాగాలని అలాకాకుండా ఇతర అభిప్రాయాలు ఉంటే వేరే దేశం వెళ్లిపోవచ్చునని తెగేసి చెప్పడంతో వారంతా దానికి అంగీకరించారని చెప్పారు. అలాంటి పరిస్దితే మనదగ్గర కూడా రావాలన్నారు. కులం పేరుతో మెజార్టీగా ఉన్న హిందూసమాజం చీలికలుపీలికలు అయితే మైనార్టీల ఆధిపత్యాన్ని భరించాల్సి ఉంటుందని, దీనిని అర్ధం చేసుకుని ఐక్యతపై దృష్టి పెట్టాలని కోరారు. ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ మాట్లాడుతూ తిరుమల-తిరుపతి దేవస్ధానంలో ఇప్పటికీ ప్రసాదం తయారీకి సంబంధించి సరుకుల సరఫరా కాంట్రాక్టు ఇప్పటికీ అన్యమతస్తుల చేతుల్లోనే కొనసాగుతోందని చెప్పారు. అలాగే ఇటీవలే బెంగాల్‌లో మరో అడుగు ముందుకు వేసి ఒక ముస్లింను కీలక ఆలయం ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి నియమించారని చెప్పారు. ఈపరిస్ధితులను భరిస్తూ కొనసాగితే రానున్న రోజుల్లో ఆలయాల్లోనూ రిజర్వేషన్లు అమలుచేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈపరిస్ధితుల్లో ఓటే ఆయుధంగా మార్చుకుని రాజకీయపార్టీల ఎజెండాలను మార్చాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీ త్రిదండి అహోబిల రామానుజ జియ్యర్‌స్వామీజీ, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ వి మురళీధరశర్మ, ద్వారకాతిరుమల దేవస్ధానం ఛైర్మన్ ఎస్వీ సుధాకరరావు, జర్నలిస్టు మ్యాగజైన్ ఎడిటర్ వివి కృష్ణంరాజు, రేమళ్ల అవధానులు తదితరులు ప్రసంగించారు. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్(జిహెచ్‌హెచ్‌ఎఫ్) , సేవ్ టెంపుల్స్ సంస్ధ(యుఎస్) సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సమ్మేళనానికి జిహెచ్‌హెచ్‌ఎఫ్ బ్రాండ్ అంబాసిడర్ డాక్టరు గజల్ శ్రీనివాస్ సంధానకర్తగా వ్యవహరించారు. పలు రాష్ట్రాలకు చెందిన మఠాధిపతులు, సాధువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం మధ్యాహ్నం సాధు శంఖారావం నిర్వహించి వివిధ అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఈసందర్భంగా పలువురికి ఆలయబంధు అవార్డులను ఎంపి సుబ్రహ్మణ్యస్వామి అందజేశారు. అలాగే పలువురికి ప్రశంసాపత్రాలు కూడా అందజేశారు.