విజయవాడ

ఆశ చావదు.. నెరవేరదు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 25: నగర పాలక సంస్థ ఉద్యోగులకు 010 జీవో ద్వారా ప్రభుత్వమే జీతాలు చెల్లించే ప్రక్రియపై ఆశ చావదు, నెరవేరదన్న ఆశ నిరాశలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈవిషయంలో పాలకులు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ఉద్యోగులు సర్వత్రా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అదిగో ఇదిగో అంటూ ఏళ్లు గడిపేస్తున్న పాలకుల చర్యలు ఉద్యోగులకు మింగుడు పడక తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. సాహసోపేతంగా ఒక్క సంతకంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నాటి ఉమ్మడి రాష్ట్రంలోని 104 మున్సిపాల్టీలు, 13 కార్పొరేషన్లకు 010 వర్తింపచేసిన ఉదంతాన్ని గుర్తుకు తెచ్చుకొంటున్న విఎంసి ఉద్యోగులు ఏళ్ల తరబడి ఎదురుచూపులు చూస్తున్న వైనం గమనార్హం. వైఎస్‌ఆర్ లాగా ఒక్క సంతకంతో పని పూర్తయ్యే అవకాశం ఉన్నా ఆ దిశగా నగర పాలకులతోపాటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా పట్టించుకోని వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే చిన్న చిన్న విషయాలకు సిఎం దృష్టికి తీసుకెళ్లి ఆయా పనులు చేయించుకునే నగర ప్రజా ప్రతినిధులెవ్వరైనా ఈవిషయాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్లి సత్వర పరిష్కారానికి చొరవ చూపకపోవడంపై విఎంసి ఉద్యోగులను మరింత బాధిస్తోంది. వాస్తవంగా 010 పద్దు కింద ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తే విఎంసికి 14 కోట్ల మేర ఆర్థికభారం తగ్గి నగరాభివృద్ధికి ఎంతో వెసులుబాటవుతుంది. విఎంసికి సుమారు 3400 మంది ఉద్యోగాలు మంజూరైతే ప్రస్తుతం వాటిలో 2300 నుంచి 2400 మంది మాత్రమే ఉద్యోగులుగా ఉన్నారు. అంటే సుమారు వెయ్యి ఉద్యోగ ఖాళీలున్నట్టు స్పష్టమవుతుండగా ఈ వెయ్యి ఉద్యోగ ఖాళీల భర్తీల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు 010 పద్దు కింద జీతాల చెల్లింపులు పెద్ద విషయం కాదనే చెప్పాలి. విఎంసికి జమవుతున్న పన్ను చెల్లింపుల ఆదాయంలో అత్యధిక శాతం ఉద్యోగుల జీతాలకే సరిపోతోందన్న విషయం విఎంసి లెక్కలే చెబుతున్నాయి. నాటి వైఎస్‌ఆర్ రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌లకు 010 జీవో అమలు చేస్తూ నిర్ణయం తీసుకొన్న సమయంలో విఎంసికి ఎందుకు వర్తించలేదన్న విషయానికి అధికారులు సవాలక్ష కారణాలు చెబుతున్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే నగర పాలక పగ్గాలు చేపట్టిన టిడిపి పాలకులు 010 వ్యవహారంపై సిఎం సానుకూలంగా ఉన్నారని, త్వరలోనే ప్రభుత్వ జీతాలు పొందుతారంటూ ఒక ప్రచారం తెరమీదకు తీసుకొచ్చారు. మేయర్ కోనేరు శ్రీ్ధర్ ఈవిషయంపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులతో సంప్రదింపులే కాకుండా కొంతమంది రాష్ట్ర మంత్రులను సైతం పలుమార్లు కలిసి విషయాన్ని విశదీకరించారు. అయితే ప్రస్తుతం ఈ ఫైల్ ఎంఎయుడి నుంచి రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి చేరబోతోందని, అక్కడ నుంచి రాష్ట్ర ఫైనాన్స్ శాఖాధికారుల క్లియరెన్స్ తీసుకొని మంత్రి వర్గ క్యాబినేట్‌కు వెళ్లాల్సి ఉంది. కొద్ది నెలలుగా ఎంఎయుడిలో తిష్టవేసిన 010 ఫైల్ వివిధ విభాగాల గుమ్మాల దాటుకుని వచ్చేసరికి పుణ్యకాలం ముగిస్తుందోన్న ఆందోళన రేగుతున్న తరుణంలో ఇటు ఆశను చంపుకోలేక, నెరవేర్చుకోలేక ఉద్యోగులు సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. దివంగత సిఎం వైఎస్‌ఆర్‌లా ముందుగా జీవో విడుదల చేస్తేనే తదుపరి అధికారిక ఫైల్స్ ప్రక్రియ శరవేగంగా నడుస్తుందని, లేకపోతే 010 కథ కంచికి, ఉద్యోగులు ఇంటికి అన్న సామెత మళ్లీ పునరావృతమవుతుందన్న వాదనలను వినిపిస్తున్నారు.