కర్నూల్

తల్లిదండ్రులను గౌరవించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూన్ 25 : ప్రతిఒక్కరూ తమ తల్లిదండ్రులను గౌరవించాలని హిమాలయ గురూజీ ఉద్బోధించారు. స్థానిక వెంకటరమణ కాలనీలోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం భారత్ వికాస్ పరిషత్ కర్నూలుశాఖ ఆధ్వర్యంలో శ్రీ పొలిమేర వేణుగోపాల్ కామక్షమ్మ చారిటబుల్ ట్రస్టు సౌజన్యంతో దాదాపు 110 మంది దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు, చేతులు, తదితర పరికాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని హిమాలయ గురూజీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం గురుజీ మాట్లాడుతూ తల్లిదండ్రులను గౌరవించని వారు మనశ్శాంతిని కోల్పోతారన్నారు. ఇతరులకు హాని చేయనంత వరకూ ప్రశాంతంగా జీవించవచ్చన్నారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ప్రశాంతత దొరుకుతుందన్నారు. కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ కర్నూలుశాఖ ఆంధ్ర ప్రాంత సహకార్యదర్శి బివి సుబ్రహ్మణ్యం, అధ్యక్షుడు మారం శ్రీనివాస్, కార్యదర్శి రేగూరు బాలకృష్ణ, కోశాధికారి కె.రాఘవేంద్రప్రసాద్, సమన్వయకర్త అమరనాథ్, ఏపిఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ బాషా పాల్గొన్నారు.