కర్నూల్

రైతులకు పంటనష్టపరిహారం అందించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలుటౌన్, జూన్ 25:2016 ఖరీఫ్ పంట నష్టపరిహారాన్ని రైతులకు సకాలంలో అందించాలని కలెక్టర్ సత్యనారాయణ ఖజానా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదివారం పంట నష్టపరిహారంపై జెడిఎ ఉమామహేశ్వరమ్మతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలోని 9 ఉప డివిజన్లకు సంబంధించిన పంట నష్టపరిహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు. 2016 ఖరీఫ్‌కు సంబంధించి దాదాపు 3.1 లక్షల మంది రైతులు పంట నష్టపోయారని వారికి ప్రభుత్వం రూ. 32కోట్లు విడుదల చేసిందన్నారు. వాటి వివరాలను జిల్లా ఖజానా శాఖ అధికారులకు అందజేయాలన్నారు. రైతులకు సకాలంలో పరిహారం అందకపోతే వాటి వివరాలు అందించాలని జెడిఎను ఆదేశించారు. సకాలంలో పరిహారం పంపిణీ చేయకుంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు సంబంధించిన పరిహారంపై ఖజానా శాఖ అధికారులతో కలెక్టర్ ఫోన్ ద్వారా మాట్లాడారు. సమావేశంలో ఆర్డీఓ హుసేన్‌సాహెబ్, తదితరులు పాల్గొన్నారు.