కడప

ప్రైవేట్ స్లీపర్ కోచ్ బస్సుల నిలిపివేత..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూన్ 25: రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఆపరేటర్లు నిబంధనల మేరకే నడపాలని లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించడం, ప్రైవేటు ఆపరేటర్ల మధ్య ఫిర్యాదుల పర్వం మొదలు కావడంతో జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే వంద స్లీపర్ కోచ్‌ల బస్సులను ప్రైవేటు ఆపరేటర్లు నిలిపివేశారు. అయితే ఆర్టీసీ మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి సంబంధిత ప్రాంతాలకు అదనపు బస్సులను నడపాలన్నా బస్సుల కొరత ఆర్టీసీని వెంటాడుతూ వస్తోంది. దీంతో ప్రయాణీకులు సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే నానావెతలు పడుతూ వారి ప్రయాణాన్ని కూడా రద్దు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సిట్టింగ్‌తో నడిచే బస్సులను మాత్రమే ప్రైవేటు ఆపరేటర్లు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఇతర ప్రాంతాలకు బస్సులను నడుపుతున్నారు. వాస్తవంగా ఆ బస్సులు కూడా ప్రభుత్వ నిబందనలకు విరుద్దంగానే కాంట్రాక్టు క్యారేజీ కింద నడపాల్సి ఉండగా స్టేజీ క్యారియర్ కింద నడుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వంద ప్రైవేటు బస్సులు సిట్టింగ్ కింద తిప్పుతున్నారు. జిల్లాలో ఆర్టీసీకి ప్రతి నెలా రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది. ఆర్టీసీ ప్రైవేటు బస్సుల స్థానంలో వివిధ సౌకర్యాలతో నడిపినట్లయితే ఆర్టీసీ నష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితులు పూర్తిగా సర్దుబాటు అవుతాయి. ప్రస్తుతం జిల్లాలో మైదుకూరు, రాజంపేట, బద్వేలు, పులివెందుల, జమ్మలమడుగు, రాయచోటి బస్సు డిపోలలోనే నష్టాలు అధికంగా వస్తున్నాయి. ప్రైవేటు బస్సులు రాయచోటి, ప్రొద్దుటూరు, కడప, రాజంపేట, పులివెందుల ప్రాంతాల నుంచే అధిక సంఖ్యలో సుదూర ప్రాంతాలకు నడుపుతున్నారు. సెలవులు వచ్చే సమయాల్లోను, ప్రతి వీకెండ్‌లోను ప్రైవేటు బస్సుల్లో అధిక లాభాలలో సీట్ల రేట్లను పెంచి నడుపుతున్నారు. ఆర్టీసీ బస్సులు పూర్తి స్థాయిలో లేనందున గమ్యం చేరడమే మార్గం పెట్టుకొని ప్రయాణీకులు ప్రైవేటు బస్సుల్లో టికెట్ల ద్వారా ఎంతైనా సరే వెనక్కు తగ్గకుండా ప్రైవేటు బస్సులనే ప్రయాణిస్తున్నారు. జిల్లాలో ప్రైవేటు బస్సులు నిబంధనలకు విరుద్దంగా తిప్పుతున్నారనే రవాణా, పోలీసు, రెవెన్యూ శాఖలకు తెలిసినా ఏమీ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారు. చివరకు సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు పట్టణాలల్లో నడిరోడ్లపైనే ప్రైవేటు బస్సులను పార్కింగ్ చేసి ప్యాసింజర్లను లోడు చేసుకుంటున్న దృశ్యాలను ప్రతి నిత్యం అధికారులు చూస్తున్నా ఏమీ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆర్టీసీ బస్సుల స్థానంలో మరికొన్ని కండీషన్ కలిగిన బస్సులను ప్రవేశం పెట్టడం కానీ, కొనుగోలు చేసి కొత్త బస్సులు నడపడం కానీ జరిపినట్లయితే ప్రైవేటు బస్సులు సంబంధిత ప్రాంతాల్లో నష్టాల బాటలో నడపలేరు. ఆర్టీసీ అధికారులు మాత్రం ఆర్టీసీ బస్సుల ప్రయాణం క్షేమకరమని ప్రకటనలకే పరిమితమవుతున్నారే తప్ప ప్రయాణీకుల రద్దీని బట్టి బస్సులను తిప్పడం లేదు. ఈ పరిస్థితులలో ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం సుదూర ప్రాంతాలకు బస్సులను నడిపి ఆదాయ వనరులను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.