కడప

సేవా కార్యక్రమాలకు సహకారం అందిస్తాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట టౌన్, జూన్ 25: సేవా కార్యక్రమాలకు తన వంతు సహయ, సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని విప్ మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక జిఎంసి ఆడిటోరియంలో జరిగిన లయన్స్‌క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మేడా మాట్లాడుతూ లయన్స్‌క్లబ్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను పేదలకుదక్కేలా చూడాలన్నారు. దారిద్రరేఖకు దిగువన ఉన్న పేదల సంక్షేమం కోసం లయన్స్ పాటుపడాలన్నారు. రాజంపేట లయన్స్‌క్లబ్ భవనానికి స్థల కేటాయింపు, భవన నిర్మాణానికి తన వంతుగా రూ. 5 లక్షలు అందజేస్తానని మేడా ఈ సందర్భంగా హమీ ఇచ్చారు. ఆర్డీఓ వీరబ్రహ్మం మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లయన్స్‌క్లబ్ ప్రజలకు అందుబాటులో ఉండేలా స్థల కేటాయింపు చేస్తామన్నారు. లయన్ పాస్ట్ డిస్ట్రిక్ గవర్నర్, ఇన్స్టలేషన్ అధికారి కె.చిన్నపరెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ సంస్థయైన లయన్స్‌క్లబ్ పేదలకు అన్నివిధాల సేవా కార్యక్రమాలను చేపడుతుందని వివరించారు. ఈ సందర్భంగా ఆయన రాజంపేట లయన్స్‌క్లబ్ నూతన అధ్యక్షులుగా సంభావు వెంకటరమణ, సెక్రటరీగా ఎం.వెంకటసుబ్బయ్య, వైస్ ప్రెసిడెంట్స్‌గా జి.హరిప్రసాద్, పి.సత్యనరసింహగుప్త, ఎస్.రామచంద్రరాజు, కోశాధికారిగా కావుటూరి సుబ్రమణ్యం నాయుడు, మెంబర్స్‌షిప్ ఛేర్మన్‌గా పి.నాగేశ్వరరావు, గ్లోబల్ యాక్షన్ టీమ్ ఛేర్మన్‌గా టి.లక్ష్మీనారాయణ, సర్వీస్ కమిటీ ఛైర్మన్‌గా డాక్టర్ సి.సుధాకర్, పిఆర్వోగా జి.గుల్జార్‌బాషా, లయన్ టామర్‌గా ఎస్.అప్సర్, టైల్ ట్విస్టర్‌గా కె.విజయకుమార్‌రాజులచే ప్రమాణ స్వీకారం చేయించి నూతన కార్యవర్గ బాధ్యతలు, కర్తవ్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ ఛేర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు, ఎం.రామకృష్ణనాయుడు, షేక్ అబ్దుల్లా తదితరులుల పాల్గొన్నారు.