కడప

నేడు రంజాన్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమలాపురం, జూన్ 25: ఆదివారం రాత్రి ఆకాశంలో నెలవంక కన్పించడంతో సోమవారం ముస్లింలు ఈదుల్‌ఫితర్ నిర్వహించు కోవాలని పెద్దదర్గా పీఠాధిపతి గఫార్‌షాఖాద్రీ ప్రకటించారు. రంజాన్ మాసం పూర్తయ్యాక షవ్వాల్ మాసం మొదటిరోజున ఈదుల్‌ఫితర్ పండుగ జరుపుకుంటామన్నారు. అయితే ఆ రోజు ముస్లింలు ఉపవాసం పాటించరాదన్నారు. చంద్రదర్శనాంతరం దర్గాలో ప్రత్యేకప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేదముస్లింలకు దర్గాపీఠాధిపతి వస్త్రాలు, బియ్యం, ఇతర సామాగ్రి, నగదును పంపిణీ చేశారు. ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా అల్లాహ్ దగ్గరయ్యేందుకు పవిత్రంగా నెలరోజులు ఉపవాసం ఉండి ఈ పండుగను జరుపుకోవడం విశేషమన్నారు. ఇలా ఉండగా పలువురు ముస్లింనేతలు పేదప్రజలకు 10 బస్తాల బియ్యాన్ని పంపిణీ చేశారు. అలాగే స్థానిక వేదాస్‌పాఠశాలలో చిన్నారులకు ముందస్తు రంజాన్‌వేడుకలను నిర్వహించి ప్రభుత్వ ఖాజీ నాసిర్‌హుస్సేన్ ఆధ్వర్యంలో రంజాన్ విశిష్టతను తెలియచేశారు. ఇందులో ప్రిన్సిపాల్ అన్నపూర్ణ పాల్గొన్నారు.