అనంతపురం

ఎన్టీఆర్ పథకాలు దేశానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, జూన్ 25 : దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేద ప్రజల అభ్యున్నతి కోసం అమలు చేసిన ఎన్నో పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎంపి నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన సాగిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారన్నారు. ఆదివారం స్థానిక ఎంజిఎం ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ఇటీవల మంజూరైన 3,500 ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపి నిమ్మల మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా మంజూరు కానన్ని పింఛన్లు ఇక్కడ మంజూరు కావడం బాలకృష్ణ వల్లే సాధ్యమైందన్నారు. ఇది హిందూపురం ప్రజల అదృష్టమన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేవలం రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తే టిడిపి అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే రూ.20 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. వైకాపా అధినేత వైఎస్ జగన్‌కు ముఖ్యమంత్రి పదవి జపం పట్టిందని, ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టేది ప్రజలు మాత్రమేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. 16 నెలల పాటు జైలుశిక్ష అనుభవించిన ఆర్థిక నేరస్తుడైన జగన్‌ను ప్రజలు ఎలా ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారన్నారు. నియోజకవర్గ అభివృద్ధి నందమూరి వంశంతోనే సాధ్యమవుతుందన్నారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ తాను ఎక్కడ ఉన్నా హిందూపురం అభివృద్ధిపైనే నిత్యం కృషి చేస్తుంటానన్నారు. ఇంతటి అభివృద్ధికి కారణమైన అధికారులను అభినందించారు. ముఖ్యంగా మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందన్నారు. మసీదుల మరమ్మతులు, దుల్హాన్ పథకం కింద పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం, రంజాన్ తోఫా వంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఇకపోతే నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గం అంటే టిడిపికి ప్రత్యేక అభిమానమని, అందుకే అడిగిన వెంటనే ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంజూరు చేయడంతోపాటు గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పట్టణానికి నీటిని తీసుకొచ్చేందుకు రూ.194 కోట్లు మంజూరు చేశారన్నారు. అలాగే నూతన కూరగాయల మార్కెట్ నిర్మాణానికి రూ.23 కోట్లు మంజూరయ్యాయని, వచ్చే శ్రావణమాసంలో భూమిపూజ చేసి గతంలో ఉన్న వ్యాపారులందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. టిడిపి ప్రభుత్వం జవాబుదారీతో వ్యవహరిస్తోందన్నారు. అలాగే నియోజకవర్గానికి ప్రస్తుతం మంజూరైన ఇళ్లతోపాటు అదనంగా వెయ్యి ఇళ్లు మంజూరు చేయిస్తానని సభికుల హర్షధ్వానాల ప్రకటించారు. పట్టణ సుందరీకరణకు మరింతగా కృషి చేయాలని సూచించారు. అంతకుముందు ఎమ్మెల్యే జన్మదినోత్సవంలో భాగంగా కేక్ కట్ చేశారు. కాగా పట్టణాభివృద్ధికి ఎంతో సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో చైర్‌పర్సన్ లక్ష్మి, వైస్ చైర్మన్ రాము తదితర కౌన్సిలర్లు ఘనంగా సత్కరించారు. దీనికితోడు అధికంగా పింఛన్లు మంజూరు చేయడం పట్ల కిరికెర సర్పంచ్ రాము ఎమ్మెల్యేను సన్మానించారు. అనంతరం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిసి కార్పొరేషన్ చైర్మన్ పామిశెట్టి రంగనాయకులు, మాజీ ఎమ్మెల్యే అబ్ధుల్‌ఘనీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గౌస్‌మోద్దీన్, మున్సిపల్ చైర్‌పర్సన్ రావిళ్ల లక్ష్మి, వైస్ చైర్మన్ జెపికె రాము, ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ జెఇ వెంకటస్వామి, మార్కెట్‌యార్డు చైర్మన్ కిష్టప్ప, డిఆర్‌డిఏ పిడి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, తహశీల్దార్ విశ్వనాథ్, ఎంపిపిలు సుభద్రమ్మ, హనోక్, నౌజియాభాను, జడ్పీటీసీలు ఆదినారాయణ, లక్ష్మీనారాయణరెడ్డి, నాయకులు ఏ.నాగరాజు, దేమకేతేపల్లి అంజినప్ప, డిఇ రమేష్‌కుమార్, అమర్‌నాథ్ లు పాల్గొన్నారు.
పింఛన్‌దారులతో బాలయ్య సహపంక్తి భోజనాలు
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పింఛన్‌దారులతో కలిసి ఎమ్మెల్యే బాలకృష్ణ సహపంక్తి భోజనం చేశారు. ఎనిమిది నెలల అనంతరం నియోజకవర్గంలో మూడు రోజుల పాటు పర్యటించిన బాలకృష్ణ గతంలో ఎప్పుడూ లేనివిధంగా హుషారుగా కనిపంచారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలిసి బాలకృష్ణ భోజనం చేసి వృద్ధులకు స్వయానా మిఠాయిలు తినిపించారు. ఇకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేస్తారా అన్న ఊహాగానాలపై బాలకృష్ణను అడగ్గా దాట వేసే ధోరణితో వ్యవహరించారు. ఇలాంటివి ఊహాగానాలు రాజకీయాల్లో సాధారణమేనన్నారు. అయితే కొందరి వైఖరి కారణంగా మనోవేదనకు గురయ్యారన్న అభిప్రాయాన్ని ఆయన్ను అడగ్గా అలాంటిది నందమూరి వంశ రక్తంలో లేదని, ఎలాంటివాటినైనా ఎదుర్కొంటామన్నారు.