హైదరాబాద్

పాట, మాటకు జీవం పోసిన సినారె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, జూన్ 25: సాహిత్య రంగంల్లో పాట, మాటకు జీవం పోసిన వ్యక్తి డా.సి.నారాయణరెడ్డి అని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి అన్నారు. హైదరాబాద్ కవుల వేదిక ఆధ్వర్యంలో ‘మహాకవి సినారెకు కవితా నివాళి’ కార్యక్రమం ఆదివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిధారెడ్డి మాట్లాడుతూ.. సినారె అన్ని పక్రియాల్లో రచనలు చేసి మహకవి అని కీర్తించారు. తెలుగు చిత్రలలో 3వేలపైగా పాటలు రాసిన అతనికి మించిన రచయితలు లేరని మెప్పించారని పేర్కొన్నారు. ప్రజాస్వామిక జీవితలను దృష్టిలో పెట్టుకుని గజల్స్ చేశారని అన్నారు. యువ కవులను ప్రోత్సహించడమే కాకుండా వారితో సమానంగా పోటీపడే వారని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఓఎస్‌డి దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ సినారె తెలుగు సాహిత్యంలో తనదైనంటువంటి చెరగని ముద్రవేసుకున్నారని తెలిపారు. సినారెకు తెలంగాణ భాషాపై విపరితమైన ప్రేమ ఉండేదని, దానిని పాటల రూపంలో వ్యక్త పరిచేవారని తెలిపారు. యువ కవులకు ఎంతో ప్రేరణ ఇచ్చారని అన్నారు. సినారెను యువ రచయితలు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ప్రముఖ రచయిత ఏనుగుల నర్సింహారెడ్డి అధ్యక్షత నిర్వహించిన కార్యక్రమంలో కాళోజి పురస్కార గ్రహీత అమ్మంగి వేణుగోపాల్, రచయితలు నాళేశ్వరం శంకరం, చెన్నయ్య, నిఖీలేశ్వర్ పాల్గొన్నారు.