హైదరాబాద్

వైభవంగా గోల్కొండ బోనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, జూన్ 25: చారిత్రాత్మకమైన గోల్కొండ బోనాల ఉత్సవాలు అంత్యంత వైభవంగా ప్రారంభమైయ్యాయి. గోల్కొండ కోటపై ఉన్న శ్రీజగదాంభిక మహంకాళీ (ఎల్లమ్మతల్లీ) అమ్మవారికి ప్రత్యేక పూజలతో మొదటి పూజను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. ఆదివారం మధ్యాహ్నాం లంగర్‌హౌస్ చౌరస్తాలో అమ్మవారి భారీ తొట్టెలకు ఆలయ కమిటీ చైర్మన్ శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్‌తోపాటు నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి పూజలు నిర్వహించారు. తొట్టెల ఊరేగింపు ప్రారంభమైంది. డప్పువాయిజ్యలు, శివసత్తుల పునకం, పోతరాజుల నృత్యాలు, యువత కేరింతతో... భక్తులు అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు జరుపుకున్నారు. మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో భక్తిశ్రద్ధలతో ప్రజలు బోనాల ఉత్సవాలు జరుపుకుంటారని పేర్కొన్నారు. నగరంలోని పాతబస్తీలో హిందు, ముస్లిం జరుపుకునే పండుగ బోనాలు, రంజాన్ అని తెలిపారు. బోనాల ఉత్సవాలు ప్రశాంతమైన వాతావారణంలో జరుపుకోవాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. వచ్చే నెల 9న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి బోనాలతో పాటు 16, 17న పాతబస్తీలోని ఉమ్మడి దేవాలయాల బోనాల జాతర కొనసాగుతుందని అన్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ గత యేడాది బోనాల ఉత్సవాల కోసం ఐదు కోట్లు రూపాయాలు కేటాయించినట్లు తెలిపారు. కాని ఈ ఏడాది ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకవెళ్లి ఈ బోనాల ఉత్సవాలకు పది కోట్లు రూపాయాల వ్యయం పెంచినట్లు పేర్కొన్నారు. నగర కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ బోనాలు ఉత్సవాలు ప్రశాంతమైన వాతావారణంలో జరుపుకోవాలని కోరారు.
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ
చారిత్రత్మకమైన గోల్కొండ కోట శ్రీజగదాంభిక మహంకాళీ అమ్మవారి బోనాల ఉత్సవాలు పురస్కారించుకుని అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు పట్టువస్త్రాలు సమర్పించారు. నాయిని, తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లంగర్‌హౌస్ చౌరస్తాలోని ఏర్పాటు చేసిన భారీ తొట్టెలకు కల్లు పోసి సాకా నిర్వహించారు.
పోతరాజుల నృత్యాలు
చారిత్రత్మకమైన గోల్కొండ బోనాల ఉత్సవాలలో భాగంగా పోతరాజుల నృత్యాలు అలరించాయి. గోల్కొండ బోనాల ఉత్సవాలలో పోతరాజుల నృత్యాలే ప్రజలను ఆకర్శించింది. పోతరాజులతో పాటు శివసత్తులు కూడా పునకం పూనారు. లంగర్‌హౌస్ చౌరస్తా నుంచి గోల్కొండ కోటపై ఉన్న అమ్మవారి దేవాలయం వరకు భారీ ఊరేగింపులో పాల్గొన్నారు.
భారీ తొట్టెల ఊరేగింపు
శ్రీ జగదాంభిక మహంకాళీ (ఎల్లమ్మ తల్లీ) అమ్మవారి బోనాల ఉత్సవాలలో భారీ తొట్టెల ఊరేగింపును నిర్వహించారు. ముందుగా మంత్రులు ఊరేగింపులో ఉత్సవ అమ్మవారి విగ్రహానికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం భారీ తొట్టెల కూడా పూజల నిర్వహించారు. అనంతరం తొట్టెల ఊరేగింపు కోలహాలంగా లంగర్‌హౌస్ చౌరస్తానుంచి గోల్కొండ కోటపై వరకు కొనసాగింది. ఊరేగింపులో డప్పువాయిద్యాలు, నృత్యాలు, ఆట, పాటలతో కొనసాగింది.
ఆకట్టుకున్న వివిధ రూపాల అమ్మవారు
తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే విధంగా వేషధారణలతో భక్తులను ఆకట్టుకున్నారు. బోనాల ఉత్సవాలలో భాగంగా వివిధ రకాల పోతరాజు, ఎల్లమ్మతల్లీ, కాళీకామాత దేవి అవతారంలో విగ్రహాలను ఊరేగింపులో లంగర్‌హౌస్ నుంచి గోల్కొండ కోట వరకు తరలించారు. వివిధ రకాల రూపాలలో ఉన్న అమ్మవారు.. భక్తులతో నృత్యాలు చేసుకుంటూ వెళ్లారు.
పూజారి ఇంట్లో ఉత్సవమూర్తికి పూజలు
గోల్కొండ చోట బజార్‌లో ఆలయ పూజారి అనంతచారి ఇంట్లో అమ్మవారి ఉత్సవ ముర్తి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుండి కోటపైకి ఊరేగింపుగా కొనసాగింది. ఊరేగింపు కోటపైకి చేరుకుని సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లంగర్‌హౌస్ నుంచి తీసుకవచ్చిన భారీ తొట్టెలను అమ్మవారికి సమర్పించారు.
భారీ పోలీస్ బందోబస్తు
చారిత్రత్మకమైన గోల్కొండ కోటపై ఉన్న శ్రీ జగదాంభిక మహాంకాళీ అమ్మవారి బోనాల ఉత్సవాలకు భారీ పోలీస్ బందోబస్తును నిర్వహించినట్లు డిసిపి ఎం.వెంకటేశ్వర్ రావు తెలిపారు. బోనాల ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకుండా పోలీస్ బందోబస్తును నిర్వహించినట్లు పేర్కొన్నారు. అశ్విక దళం బందోబస్తు కోసం పాల్గొన్నారు.