హైదరాబాద్

భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జూన్ 25: నగరంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, లక్డీకపూల్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, శ్రీనగర్‌కాలనీ, బేగంపేట, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో యథావిధిగా ఆయా రహదారులపై ట్రాఫిక్ స్తంభించింది. పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రి వద్ద, మోడల్ హౌస్ వద్ద నీరు నిలిచిపోయింది. దీంతో ఖైరతాబాద్ వైపు నుంచిఅమీర్‌పేట వైపు వెల్లే రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. రాజ్‌భవన్ రూట్‌లో లేక్‌ఫ్యూ అతిథిగృహం వద్ద రోడ్డు జలమయం కావడంతో ఆ దారిలో ట్రాఫిక్‌కు స్వల్ప అంతరాయం ఏర్పడింది. సాధారణ సమయంలోనే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడే అమీర్‌పేట మైత్రివనం వద్ద వర్షంతో మరింత ఇబ్బంది నెలకొంది. ఆదివారం సెలవుదినం కావడంతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై వర్ష ప్రభావం పెద్దగా చూపలేదు. ఖైరతాబాద్, లక్డీకపూల్‌లోని పలు రోడ్లపై నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్ష ప్రభావం ట్యాంక్‌బండ్‌తో పాటు లుంబినీ పార్క్, బుద్దపూర్ణిమా, నెక్లెస్ రోడ్, ఎన్‌టిఆర్ గార్డెన్, ఇందిరాపార్క్, ఐ మ్యాక్స్‌ల సందర్శనకు చేరుకున్న వారిపై చూపింది. ఉదయం నుంచి వాతావరణం పొడిగానే ఉండటంతో ఆయా ప్రాంతాలకు సందర్శకులు తరలివచ్చారు. రాత్రి 8:30 ప్రాంతంలో ఒక్కసారిగా వర్షం పడటంతో తడిసి ముద్దయ్యారు.