శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

తెలుగుగంగ నుండి తిరుపతికి తాగునీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాపూరు, జూన్ 26: నెల్లూరు జిల్లా రాపూరు మండల పరిధిలోని తెలుగుగంగ జలాశయం నుండి చిత్తూరు జిల్లా తిరుపతి, శ్రీకాళహస్తి ప్రజల తాగునీటి అవసరాలకు మంచినీటి పంపింగ్‌ను పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఆదివారం ప్రారంభించారు. కండలేరుకు చేరుకున్న మంత్రి రెండు మోటార్లను లాంఛనంగా ప్రారంభించారు. నాలుగు గంటల అనంతరం రాహుకాలం సమీపిస్తుందన్న కారణంతో వెంకటగిరి ఎమ్మెల్యే కె రామకృష్ణ ఓ మోటార్‌ను ప్రారంభించారు. సుమారు రూ. 24 కోట్ల వ్యయం అంచనాలతో చేపట్టిన ఈ పథకం గురించి పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీకాళహస్తి, చిత్తూరు, తిరుపతి ప్రాంత ప్రజల సౌకర్యార్థం 24 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వం మంచినీటి పంపింగ్ చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో ఐదు టిఎంసిల నీరు డెడ్ స్టోరేజిలో ఉందన్నారు. వంద రోజులపాటు నిర్విరామంగా పంపింగ్ ద్వారా రెండు టిఎంసిల నీటిని సాయిగంగ కాలువ ద్వారా కాళహస్తి, తిరుపతి, చిత్తూరు ప్రాంతవాసులకు ఈ జలాలను తాగునీటి కోసమే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జలాశయం ద్వారా పంపింగ్ చేసే సమయంలో సాయిగంగ కాలువ ద్వారా ప్రవహించే నీటిని రైతులు సాగునీటి అవసరాల కోసం వినియోగించరాదని తెలిపారు. అలా వినియోగించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉండటం వల్ల 24 కోట్ల రూపాయల వ్యయంతో ఈ బృహత్తర పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందన్నారు. ఇంకా తాగునీటి అవసరాల కోసం అవసరమైతే పంపింగ్ కాలాన్ని పెంచేందుకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మరో రెండు మోటార్లను ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఆర్‌డిఓ వెంకటేశ్వర్లు, తెలుగుగంగ ఎస్‌ఇ కెవి రమణ, తెలుగుగంగ ఇఇ సురేష్‌బాబు, డిఇ రమణ, తదితర అధికారులు పాల్గొన్నారు.