చిత్తూరు

గ్రామస్థాయి నుంచి భజన మండళ్లను పటిష్టం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 25: దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలోని భజన మండళ్ళ సభ్యులు ప్రజల్లోభక్తిబావాన్ని పెంపొందించేందుకు గ్రామ స్థాయి నుంచి భజన మండళ్ళను పటిష్టం చేయాలని టిటిడి ఇ ఓ కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్ సింఘాల్ పిలుపునిచ్చారు. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని గోవిందరాజ స్వామి 3వ సత్రం ప్రాంగణంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం కార్యక్రమంలో ఇ ఓ పాల్గొన్నారు. ఈసందర్భంగా వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ సనాతన హైందవ ధర్మప్రచారంలో యువతను భాగస్వామ్యం చేయాలని అన్నారు. దాససాహిత్య ప్రాజెక్టులోని భజన మండళ్ల సభ్యులు క్రమశిక్షణ,నైపుణ్యం కలిగివున్నట్లు చెప్పారు. భజన మండళ్ళ సభ్యులు తమ పిల్లలకు, కుటుంబ సభ్యులకు మన సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేసి మంచి నడవడిక అలవరచాలన్నారు. వేదాలు, ఉపనిషత్తుల్లోని సారాంశాన్ని, సామాన్యప్రజలకు అర్థమయ్యేలా తెలుగులో అన్నమయ్య,కన్నడలో హరిదాసుల తమ కీర్తనల ద్వారా విశేషకృషి చేశారని వివరించారు. సనాతన హైంధవ ధర్మం ప్రచారం ఏయాల్సిన బాధ్యత టిటిడిపై ఉందన్నారు. తిరుపతి జె ఇ ఓ పోలభాస్కర్ మాట్లాడుత శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం భజన మండళ్ళ సభ్యులకు మోక్షానికి అవసరమైన జ్ఞానాన్ని ప్రసాదించి మహత్తర కార్యక్రమమని అన్నారు. మానవులు జ్ఞాన పూర్వకంగా, శ్రద్ధతో, యోగ్యతానుసారంగా పనిచేయాలని శ్రేయో మార్గమైన ఇలాంటి అంశాలను అలవరుచుకుంటే జీవనం సుఖమయం అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా గోవాడకు చెందిన జి.శ్రీనివాసరావు, కిష్కిందపాళ్యెంకు చెందిన ముకుందేశ్వర స్వామిలను ఇ ఓ శాలువాకప్పి సత్కరించారు. వీరిరువురూ జిల్లాలో దాససాహిత్యప్రాజెక్టు భజన మండళ్లను ఏర్పాటు చేసి, వారికి సాంప్రదాయ భజనలు, కోలాటాలు, కీర్తనలలోవిస్తృ శిక్షణ ఇస్తుండటం పట్ల వారిని అభినందించారు. ఈకార్యక్రమంలో దాససాహిత్యప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనందతీర్థాచార్యులు, డిప్యూటి ఇ ఓ దామోధరం, సహాయ ప్రజా సంబంధాల అధికారి పి.నీలిమ తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా శోభాయాత్ర
టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన మండళ్ల శోభాయాత్ర ఆదివారం సాయంత్రం వైభంగా జరిగింది. స్థానిక మూడో సత్రం ప్రాంగణంలో ఉదయం 5 నుంచి 7గంటల వరకు భజన మండళ్ళతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు గోవిందరాజ స్వామి ఆలయం వద్ద నుంచి శోభయాత్ర ఘనంగా ప్రారంభమైంది. భజనలు,కోలాటాలతో శోభయాత్ర మూడో సత్రం వద్దకు సాగింది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాదాపు 3వేల మంది భజన మండళ్ళ సభ్యులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.27వ తేదీ తెల్లవారు జామున 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద ప్రముఖులతో మెట్లపూజ నిర్వహించి అక్కడ నుంచి సాంప్రదాయ భజనలు చేస్తూ తిరుమలకు చేరుకుంటారు. ఈకార్యక్రమంలో గోవిందరాజ స్వామి ఆలయ డిప్యూటి ఇ ఓ వరలక్ష్మి, దాససాహిత్యప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆంనద తీర్థాచార్యులు తదితరులు పాల్గొన్నారు.