చిత్తూరు

శ్రీవారిని, అమ్మవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 25: ఎందరోమహానుభావులు.. అందరూ ఆ పాద సేవకే అన్న త్యాగరాజ సంకీర్తనలో చెప్పినట్లుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్ కుటుంబ సమేతంగా గత రెండురోజులుగా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నారు. శనివారం తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకున్న ప్రధాన న్యాయమూర్తి దంపతులు ఆదివారం తెల్లవారుజామున తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతికి చేరుకొని తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టిటిడి ఇ ఓ అనిల్‌కుమార్ సింఘాలు, జె ఇ ఓ శ్రీనివాసరాజు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లుచేశారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ప్రధానన్యాయమూర్తి దంపతులకు, కుటుంబ సభ్యులకు రంగనాయక మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం పలికారు. అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుచానూరులో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం గజ మండపంలోవేద పండితులు వేదాశీర్వచనం పలికారు. తిరుపతి జె ఇ ఓ పోలాభాస్కర్, ఆలయ డిప్యూటీ ఇ ఓ మునిరత్నంలు దర్శన ఏర్పాట్లుచేసి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం శ్రీ కాళహస్తిలో ముక్కంటీశ్వరుడ్ని, భ్రమరాంబను దర్శించుకున్న అనంతరం కెహార్ మధ్యాహ్నం 2.15 గంటలకు రేణిగుంటకు చేరుకొని ఎయిర్ ఇండియా వమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంతాన గౌడర్
సుప్రీంకోర్టు న్యాయమూర్తి మోహన్ ఎం.సంతానగౌడర్ ఆదివారం ఉదయం విరామసమయంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లుచేశారు. దర్శనానంతరం న్యాయమూర్తి దంపతులకు వేద పండితులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం పలికారు. జె ఇ ఓ శ్రీనివాసరాజు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
రాహు-కేతు పూజలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
శ్రీ కాళహస్తి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జగదీష్ సింగ్ తేహార్ ఆదివారం ఉదయం శ్రీ కాళహస్తీశ్వరాలయంలో ప్రత్యేక రాహు-కేతు పూజ చేయించుకున్నారు. తిరుమల పర్యటన ముగించుకొని కుటుంబ సభ్యులతో శ్రీ కాళహస్తీశ్వరాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు, సభ్యుడు గుర్రప్పశెట్టి, ఇ ఓ బ్రమరాంభ, వేదపండితులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక రాహు-కేతు పూజలు చేయించుకొని స్వామి,అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆ తరువాత దక్షిణామూర్తి సన్నిధిలో వేదపండితులు ఆశీర్వదించారు. ట్రస్టుబోర్డు ఛైర్మన్ గురవయ్యనాయుడు, ఇ ఓ భ్రమరాంబ తీర్థప్రసాదాలను స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి దుర్గారావు, స్థానిక న్యాయమూర్తులు పాల్గొన్నారు.