చిత్తూరు

తిరుమలలో తగ్గని రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 25: వేసవి సెలవులు ముగిసినా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల రద్దీమాత్రం తగ్గడంలేదు. ఆదివారం రద్దీ గణనీయంగా పెరిగింది. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. దివ్యదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయి భక్తులు స్వామి దర్శనం కోసం కాంప్లెక్స్ వెలుపల బారులు తీరి ఉన్నారు. ఆదివారం ఉదయం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 70,792వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. మరో 25వేల మందికిపైగా భక్తులు స్వామిదర్శనం కోసం వేచి ఉన్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో పలు సందర్భాల్లో రోజుకు 1లక్ష మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్న విషయం పాఠకులకు విదితమే.
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ నటి శ్రీదేవి దంపతులు
తిరుపతి: అతిలోక సుందరిగా అన్ని భాషల్లో కీర్తిఘడించిన ప్రముఖ సినీనటి శ్రీదేవి, ఆమె భర్త బోనికపూర్ ఆదివారం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం, దర్శన ఏర్పాట్లుచేశారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన శ్రీదేవిని చూడటానికి అభిమానులు ఎనలేని ఆసక్తి చూపించారు. ఈసందర్భంగా శ్రీదేవి ముఖులిత హస్తాలతో అందరికీ చిరునవ్వుతో నమస్కరించారు.