Others

విజువల్స్ విందు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా ప్రపంచం ఇప్పుడు గ్రాఫిక్స్ వెనుక పరిగెడుతోందా? అన్న సందేహాలు ముసురుతున్నాయి. ఒకప్పుడు కథ. తరువాత కథనం. కొంతకాలం అద్భుతమైన ఫొటోగ్రఫీ. ఇప్పుడు వీటన్నింటికీ జతగా గ్రాఫిక్స్ మాయ. వందల కోట్ల పెట్టుబడి, అత్యున్నత సినీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రయోగించి భారీ సినిమాలు తీసి ప్రేక్షకులపైకి వదలడానికి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్న నిర్మాతలు ఇప్పుడు తెరపైకి వస్తున్నారు. ప్రేక్షకుల్ని ఊరిస్తూ ఇప్పటికే ప్రకటనలు గుప్పిస్తున్నారు కూడా.

ఆన్సర్ షీట్‌ని స్కెచ్‌పెన్, మార్కర్‌తో అందంగా డిజైన్ చేసేస్తే పాసైపోవచ్చన్నది స్టూడెంట్‌కి ఎంత భ్రమో.. భారీ హంగులు, గ్రాఫిక్స్ మాయతో సినిమాని మలిస్తే వెర్రిగా ఆడేస్తాయన్నదీ నిర్మాతల భ్రాంతే! రైడింగ్ కుదురుగా రాయాలి. క్వొశ్చన్‌కి సరిపడా ఆన్సర్ ఉండాలి. ఇవి కదా పాస్‌కి సరితూగే సరకులు. ఇక్కడా.. అద్భుతమైన కథ, అబ్బురపర్చే కథనాలున్న సినిమాల కోసం కదా ప్రేక్షకుడు ఎగబడేది!
మరి అన్నివందల కోట్లు (డాక్టర్ బిఆర్ శెట్టి ప్రకటించిన మహాభారతం బడ్జెట్ వెయ్యి కోట్లు. అల్లు అండ్ కో రామాయణం ఐదు వందల కోట్లు అంటున్నారు. బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ ‘శివాజీ’ 220 కోట్లు అన్న మాట వినిపిస్తోంది) మంచినీళ్ల ప్రాయంలా వెచ్చించి సినిమాలు చేయబోయేది గ్రాఫిక్స్ మీద భారం వేసేనని చెప్పకనే చెబుతున్న లేటెస్ట్ కబర్. దేరీజ్ నో కాంట్రావర్సీ!
మరి అలాంటి గ్రాఫిక్స్ డిజైన్స్ సినిమాలు.. రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయి, అందులో సన్నివేశాలు ఎలా ఉండొచ్చన్న ఊహమేరకు సరదాగా ‘వ్యాస విజువల్’ అల్లుకుంటే..
మూవీ మేకర్స్‌ని నొప్పించడానికో.. చదువరులని ఒప్పించడానికో కాదు. జస్ట్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్. ఇండియన్ స్క్రీన్‌ను సాంకేతిక విలువల ఆక్రమించేసిన తీరు ఇప్పటికే అనుభవైకమే కనుక, అక్కడి నుంచి సన్నివేశాన్ని కాస్త ముందుకు ఊహిద్దాం.
* * *
మహాభారతంలోకి ప్రవేశిస్తే-
మహాభారతమే ఓ గొప్ప లైఫ్ డ్రామా. అందులోని ప్రతి సన్నివేశమూ ఒక సినిమాగా మలుచుకోదగ్గ స్పాన్ ఉన్నదే. ఎన్నో అద్భుత ఘటనలు, ఆశ్చర్యపర్చే సన్నివేశాలు. వాటికి గ్రాఫిక్స్ మాయను జోడించి రోమాలు నిక్కబొడిచేలా స్క్రీన్‌కు ఎక్కిస్తే.. ఆసక్తికరమైన గ్రాఫిక్స్ సన్నివేశాలకు శరీరంపై రోమాలు నెమ్మదిగా కత్తుల్లా లేస్తుంటే... చప్పట్లు! అత్యద్భుత ఆశ్చర్యకర అపురూప దృశ్యాలు విజువల్స్‌తో కోకొల్లలుగా అల్లుకోవచ్చు. అంత ముడిసరుకు మహాభారతంలో ఉంది. అందులోంచి ఒక ఘట్టాన్ని తీసుకుని, సాంకేతిక విలువల్ని ఆపాదించి, మస్తిష్కంపై ఒక్కసారి కనులారా తిలకిస్తే..
బాణం ఎక్కుపెట్టి తల పైకెత్తి చూశాడు బాల అర్జునుడు. అనంతమైన ఆకాశం. మునె్నన్నడూ కనిపించని విధంగా రంగురంగుల నురగలు తేలిపోతున్నట్టు మేఘాలు. మేఘాల్లోంచి చూపు మరింత ముందుకు సారిస్తే ప్రశాంతమైన ఆకాశంలో పాలపుంతలు. నల్లని వస్త్రంపై మెరుస్తున్న బియ్యపు గింజలు ఆరబోసినట్టు కోటానుకోట్ల నక్షత్ర రాశులు. ఒకటా రెండా ఓహ్! వేనవేల సూర్యుళ్లు. అర్జునుడు ఆకాశంలోకి బాణాన్ని ఎందుకు ఎక్కుపెట్టాడోనన్న అసలు విషయాన్ని పక్కనపెట్టేసి -అద్భుతంగా తీర్చిదిద్దిన గ్రాఫిక్స్ రోదసిని కన్నార్పకుండా చూడటమే ప్రేక్షకుడి పని. స్క్రీన్ ముందు కూర్చున్న ప్రేక్షకుడు వండరైపోవడం ఖాయం. తెరమీద ఆవిష్కృతమయ్యేది ఊహాతీత లోకమని తెలిసినా తప్పది మరి. అది -గ్రాఫిక్స్ మహిమ.
సీన్‌లోకి వస్తే -ద్రోణాచార్యులు తన శిష్యులకు విలువిద్య పోటీలు నిర్వహిస్తోన్న సంఘటన అది. ఆ అంతులేని అనంత అంతరిక్షంలో గురువు ఆజ్ఞమేరకు మిగతా సూర్యుళ్లకి భిన్నంగా మిరుమిట్లు గొలుపుతున్న ఒక సూర్యగోళాన్ని కనిపెట్టి... దానిపైకి అర్జునుడు వారుణాస్త్రం వదలాలి. అదీ సన్నివేశ సారం. సీన్ ప్రకారం అర్జునుడు దాన్ని కనిపెట్టి బాణం వదిలాడు. ఆ బాణం అంతరిక్షం వైపు ఎలా వెళ్తోందంటే.. గ్రాఫిక్స్ కనుక అది బాణంలా కనిపించడదు. రంగులన్నింటినీ గుదిగుచ్చి బాణాకారంలోవున్న కాంతి సమూహం కదులుతున్నట్టు..! ప్రేక్షకుడు నోరెళ్లబెట్టాల్సిందే.
ఈ గ్రాఫిక్స్‌ను కనుక ‘అవతార్’ దర్శకుడి దృష్టికొస్తే, తన సీక్వెల్స్ రద్దుచేసుకుని గ్రాఫిక్స్ స్టడీ కొసం మన వెంట పడక తప్పదు. అంత లేదన్న ఆలోచన ఇప్పుడనిపించొచ్చు. స్క్రీన్ మీద సీన్ చూసినపుడు మాత్రం -అవున్రోయ్ అనుకోక తప్పదు.
* * *
ఇక రామాయణం సీన్ చూద్దాం-
గ్రాఫిక్స్‌లో సీతా స్వయంవర సన్నివేశ మధుర ఘట్టాన్ని తనవితీరా మైండ్ విజువల్‌లో తిలకిద్దాం. శివధనుస్సు ఎత్తే వంతు శ్రీరాముడికి వచ్చింది. ధనుస్సుని ఎక్కుపెట్టి సీతమ్మ మనసు గెలవాలన్న ఆలోచనతో రాముడు వస్తున్నాడు. సభా ప్రాంగంణలో అంతా లేచి నిలబడ్డారు. ఒకవైపు చూపు సారించిన రాముడికి (ఆ కోణంలో ప్రేక్షకుడికి) -విచిత్రాతి వింత లోకం ఆవిష్కతమవుతోన్న అనుభూతి. నీలి మబ్బుల ఆకాశంలో ఆధారరహితంగా గాలిలో వేలాడుతున్న ఓ ధనస్సు (ఇంద్రచాపం). సప్త వర్ణాలతో ఆకాశానే్న ఆవరించినంత పెద్దగా, శోభాయమానంగా, తేజోమయంగా సాక్షాత్కరించింది. ఆ వర్ణాల్లో ఏ రంగుభాగం నుండి ఆ రంగు పుష్పాలు దివినుండి భువికి వెదజల్లినట్టు పూల జలపాతంలా నీలమేఘశ్యామునిపై పడుతున్నాయి. ఆ సీన్ చూడ్డానికి ప్రేక్షకుడికి రెండు కళ్లు చాలవు. సీట్లోంచి లేచి హరివిల్లు ఆకారంలోని సరికొత్త ధనుస్సుని చేతితో తడిమి పరవశించాలని ఉబలాటపడేంత సాంకేతికత అక్కడ ఆవిష్కృతమైందన్న మాట. చిరునవ్వుతో శ్రీరాముడు ఫాస్ట్‌యాక్షన్ మోడ్‌లో ధనుస్సువైపు చేయిచాపుతుంటే... ఆయన ప్రతి కదలికకి హరివిల్లు కొద్దికొద్దిగా చిన్నదవుతూ దగ్గరవుతోంది. ఆయన చేతివేళ్ల కొసల్ని తాకీతాకగానే హరివిల్లు (్ధనుస్సు) రంగులు విరిగిపడ్డట్టు ఫెళఫెళమంటూ... ఇక చెప్పేదేముంది? ఆ గ్రాఫిక్స్ మాయాజాలానికి ప్రేక్షకుడు ఫిదా కావడం ఖాయం. మైండ్ బ్లోయింగ్ విజువల్ అట్రాక్షన్స్‌తో గ్రాఫిక్స్ దర్శకులు సన్నివేశాన్ని రక్తికట్టించారని మనసులు ప్రశంసిస్తూ బయటకు రావడం ఖాయం. నమ్మకం కలగడం లేదా? జస్ట్ వెయింట్ అండ్ సీ.
* * *
చత్రపతి శివాజీ చెంతకు వెళదాం-
అందరూ ఎరిగిన శివాజీని మోసపూరితంగా ఔరంగజేబు బంధించే సన్నివేశాన్ని గ్రాఫిక్స్‌లో మన దర్శకులు ఎలా తీస్తారో ఊహించుకుందాం. ‘మహారాష్ట్ర వీరుడు పిరికితనం ఎరుగని మహాయోధుడు శివాజీ గట్టి పిండం హుజూర్! కొండనైనా పిండి చేయగల ఘటికుడు’ వొంగి సేవకుడు విన్నవిస్తుంటే ఔరంగజేబు రక్తం మరిగిపోతోంది. కోపంతో ఊగిపోతూ ‘అలాగైతే కొండకే శివాజీని కట్టేయండి’ అని హుకుం జారీ చేసేస్తాడు ఔరంగజేబు, పట్టుబడిన శివాజీని ఉద్దేశించి. ఓ పాతికకి తక్కువకాకుండా సైనికులు శ్రమకోర్చి ఓ అతిపెద్ద కొండకి శివాజీని కట్టేస్తారు. ఆ సన్నివేశంలో కనిపించే గ్రాఫిక్స్ నభూతో నభవిష్యత్ అన్న ఊరింపులు అంతకుముందే వినివుంటాం. ఆ కోణంలో సీన్ చూడ్డానికి ప్రిపేర్ అవుతాం. ‘ఆ గ్రాఫిక్స్ కొండ మామూలుగా ఉండదు. బంగారు ఛాయతో కాంతులీనుతూ కొత్తగా, వింతగా కనురెప్పల్ని వాల్చనీయకుండా భలేగా ఉంటుందన్నమాట. పైగా ఆకాశాన్ని తాకుతున్నట్టు, దాని శిఖరమే కనబడనట్టు ఉంటుంది. కెమెరా ఆ కొండచుట్టూ తిరుగుతోంటే.. ప్రేక్షకుడి ఊపు చూడాలి. మైమర్చిన ప్రేక్షకుడు రెప్ప వేయడం మర్చిపోతాడు. ఇక్కడ శివాజీని చూపించడం ఆపేసి -కొండ, దాని పుట్టుపూర్వోత్తరాల చుట్టూ కెమెరా తిరుగుతుంటోంది. అది వేరే విషయం.
శివాజీని ఒంటరిని చేసి సైనికులు కనుమరుగయ్యాక, శివాజీ తన అపార భుజబల పరాక్రమంతో దైవనామస్మరణ గావిస్తూ తనని బంధించి ఉంచిన తాళ్లని తెగ్గొట్టే క్రమంలో... ఆవేశంగా ముందుకీ వెనక్కీ కదుల్తోంటే అనూహ్యంగా కొండ ఆయన ప్రతి కదలికకీ కొంచెం కొంచెం చిన్నదవుతుంటుంటే.. -అప్పుడు చూడాలి విజువల్స్ నా సామిరంగా. టిక్కెట్టు డబ్బుకి పూర్తిగా గిట్టుబాటయ్యే సన్నివేశంరా అని అనుకోని ప్రేక్షకుడు ఉండడు. బ్రహ్మాండమంత కొండ చివరకు అణువంతై శివాజీ పాదాల చెంత చేరినట్టు గుప్పెడంత సైజుకి మారిపోతుంది.
ఇలాంటివెన్నో క్రేజీ సన్నివేశాల్ని గ్రాఫిక్స్‌తో క్రియేట్ చేయడం మనవాళ్లు కొత్తగా నేర్చుకున్న విద్య. ఇప్పుడిక ఇంగ్లీషోళ్లని కాపీ కొట్టాల్సిన ఖర్మ మనకేంటండీ బాబూ.
ఒక సినిమా మొదట ఊహనుంచే పుడుతుంది. ఇప్పుడు ఆ ఊహకు గ్రాఫిక్స్ బలం వచ్చేసింది. వచ్చే భారీ సినిమాలన్నిటా ఇలాంటి సన్నివేశాలే దర్శనమివ్వడం ఖాయం. ఇప్పటి నుంచీ ఊహించుకుంటూ ఎదురుచూడటమే ఆడియన్స్ పని. ఏమంటారు?

-ఎనుగంటి వేణుగోపాల్