నల్గొండ

వెలుగుపల్లి వద్దనే శ్రీరాంసాగర్ రిజర్వాయర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుంగతుర్తి,జూన్ 25: మండలంలోని వెలుగుపల్లి గ్రామం వద్దనున్న రుద్రమ చెరువు దశమారబోతోంది. శ్రీరాంసాగర్ రెండో దశ నీటిపారకం కింద దీన్ని రిజర్వాయర్‌గా మార్చడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని అతిపెద్ద చెరువుల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ చెరువుని రిజర్వాయరుగా మార్చడానికి గత కొన్నిరోజులుగా వివిధ కోణాల్లో పర్యవేక్షణలు జరిగాయి. దాదాపుగా వేయి ఎకరాలపైబడి విస్తీర్ణంలో వున్న రుద్రమ చెరువుని రాజర్వాయరుగా మార్చే ప్రక్రియ దాదాపు 15 ఏళ్ళకి తమే మొదలైనప్పటికి తదనంతరం జరిగిన పరిణామాలతో అది మూలకుపడింది. ఇప్పుడు భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్, స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో మళ్ళీ ఇది తెరపైకి వచ్చింది. మొదట్లో రిజర్వాయరు ఏర్పాటుకు మూడు ప్రదేశాలను వారు ఎంపిక చేసి వివిధ రకాలుగా పరిశీలనలు చేశారు. బండరామారం-గుండెపురి గ్రామాల మధ్య, వెంపటి గ్రామ చెరువు, వెలుగుపల్లి గ్రామం వద్ద నున్న రుద్రమ చెరువుని వారు పరిశీలించారు. చివరకు వారంతా రుదమ్ర చెరువునే ఎంపిక చేసి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా శ్రీరాంసాగర్ రెండో దశ వరంగల్ జిల్లా వర్దన్నపేట ప్రాంతం నుండి ప్రారంభమవుతుంది. ఇది సూరాపేట జిల్లాకు వచ్చేసరికి వెలిశాల గ్రామం నుండి ప్రారంభమవుతుంది. అయితే వరంగల్ జిల్లాలో రెండో దశ కింద వర్దన్నపేట, మైలారం, కొడకండ్ల ప్రాంతాల్లో రిజర్వాయర్లు వున్నాయి. సూర్యాపేట జిల్లాకు వచ్చేసరికి ఇంతవరకు ఒక్క రాజర్వాయరు కూడా ఏర్పాటుకాలేదు. దీంతో ప్రతీ ఏడాది శ్రీరాంసాగర్ రెండో దశ నీటి రాక కోసం సూర్యాపేట జిల్లా ప్రజలు పక్క జిల్లాలోని కొడకండ్ల మండల కేంద్రంలోని బయ్యన్నవాగు రిజర్వాయరుపైనే ఆశలు పెట్టుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే అనేక సందర్భాలలో బయ్యన్నవాగు వద్ద నీటి విడుదలపై అనేకమార్లు గొడవలు కూడా జరిగాయి. కొడకండ్ల ప్రా ంత ప్రజా ప్రతినిధులు గతంలో నీటి విడుదలపై అనేక అడ్డంకులు సృష్టిస్తున్న పంచాయితీలను ఏకంగా రాష్ట నీటిపారుదల శాఖ మంతి హరీశ్‌రావు దృష్టికి తుంగతుర్తి ప్రాంత నేతలు తీసుకెళ్ళారు. అంతేగాకుండా అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇలాంటి గొడవలు జరగడంతో అప్పటి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ఏకంగా అప్పటి ముఖ్యమంతి కిరణ్‌కుమార్‌రెడ్డి, సంబంధిత శాఖ మంత్రి, అధికారుల వద్దకు వెళ్ళి సమస్యను పరిష్కరించుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా కాలువల ద్వారా నీటి విడుదలపై ప్రతీ సందర్భంలోనూ కొడకండ్ల ప్రాంతవాసులతో ఇబ్బందులు తలెత్తుతున్న విషయాలన్నీ దృష్టిలో పెట్టుకున్న ఇక్కడి ప్రజా ప్రతినిధులు తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి, తిరుమలగిరి, నూతనకల్, అర్వపల్లి మండలాల్లో రిజర్వాయర్ల ఏర్పాటుకు ముందుకొచ్చారు. ఇందులో భాగంగానే తుంగతుర్తి మండలానికి వచ్చే సరికి వెలుగుపల్లి గ్రామ పరిధిలోని రుద్రమ చెరువుని ఎంపిక చేశారు. కాగా చెరువుని రిజర్వాయరుగా మార్చడం వల్ల కాశీతండా, జొన్నలగడ్డతండా, మేగ్యతండాలకు ఇబ్బందులు ఏర్పడనున్నాయి. అయితే ఇక్కడి ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలనే ఆలోచనలను కూడా ప్రజా ప్రతినిధులు చేస్తున్నారు. రిజర్వాయరు ఏర్పాటుతో తుంగతుర్తి, అర్వపల్లి మండలాల్లోని పలు గ్రామాలకు నీటి సౌకర్యం కలగనుంది.