అదిలాబాద్

కందకాల తవ్వకాలను ఆపకుంటే తీవ్ర పరిణామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడెం, జూన్ 26: మండలంలోని మద్దిపడగ, నవాబ్‌పేట్‌తోపాటు పలు గ్రామాల్లో అటవీశాఖ అధికారులు అక్రమంగా పేదలు సాగుచేసుకుంటున్న పోడు భూముల్లో, పట్ట్భాము ల్లో అక్రమంగా కందకాలు తవ్వుతున్నారని, ఈ కందకాల తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎఐకెఎంఎస్ అఖిలభారత రైతుకూలీ సంఘం నాయకులు మాన్క దేవన్న, దాసండ్ల సుదర్శన్, ఆకుల సత్తన్నలు హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలో విలేఖర్లతో మాట్లాడారు. కడెం మండలంలోని నవాబ్‌పేట్ గ్రామ పరిధిలో పట్ట్భామిలో అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా ప్రొక్లేన్‌ను పెట్టి పై భూమిలో కందకాలు తవ్వించారన్నారు. ఈనెల 25న రాత్రి 9 గంటల సమయంలో దొంగచాటుగా కందకాలను తవ్వుతుండగా అఖిలభారత రైతుకూలీ సంఘం నాయకులు, గ్రామానికి చెందిన రైతులు ఈ కందకాల తవ్వకాలను అడ్డుకోవడం జరిగిందన్నారు. దీంతో తెల్లవారుజాము వరకు ఈ కందకాల తవ్వకాల పనులను చేయవద్దని, ఆ సమయంలో పనులు నిలిపివేశారన్నారు. మళ్లీ సోమవారం ఉదయం రైతుకూలీ సంఘం డివిజన్ నాయకులు దేవన్న, సుదర్శన్, సత్తన్న, గ్రామాల రైతులు కలిసి సాగుభూముల్లో అటవీశాఖ అధికారులు అక్రమంగా తవ్విన కందకాలను పరిశీలించడం జరిగిందన్నారు. అలాగే ఈనెల 24న కూడా మద్దిపడగ గ్రామ శివారులో కూడా అటవీశాఖ అధికారులు కందకాలు తవ్వుతుండగా మా పార్టీ నాయకులు ఆపివేసిన విషయాన్ని వారు గుర్తుచేశారు. పై విషయాన్ని అటవీశాఖ మంత్రి జోగురామన్న, ముఖ్యమంత్రి కేసి ఆర్ ఆదేశాలను దిక్కరించి జిల్లాలో పోడు, పట్ట్భాముల్లో కందకాలను తవ్వుతున్నారని, దీనిని వెంటనే ఆపివేయాలని తవ్విన కందకాలను ఫారెస్ట్ అధికారులే తిరిగి పూడ్చాలని వారు డిమాండ్‌చేశారు. లేనిపక్షంలో ఎఐకెఎంఎస్ అధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఆందోలనలకు, తీవ్ర పరిణామాలకు అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని పై నాయకులు హెచ్చరించారు.