అదిలాబాద్

భక్తిశ్రద్ధలతో ఈద్ ఉల్ ఫితర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూన్ 26: ముస్లిం సోదరుల నెలరోజుల ఉపవాస దీక్షల అనంతరం అత్యంత వేడుకగా జరుపుకునే రంజాన్ పర్వదినాన్ని సోమవారం జిల్లా అంతటా భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, ఇచ్చోడ, భైంసా పట్టణాల్లో ఈద్ ఉల్‌పితర్ సందడి, సామూహిక ప్రత్యేక ప్రార్థనలతో ఈద్గా మైదానాలు కిటకిటలాడాయి. ఆదివారం నెలవంక దర్శనమివ్వడంతో సోమవారం ఉదయం నుండే పట్టణాలు, మండల కేంద్రాల్లో ముస్లింలు ఆనందోత్సహాలతో రంజాన్ పండగను జరుపుకొని నెలరోజుల దీక్షలను విరమించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఈద్గా మైదానానికి వివిధ ప్రాంతాల నుండి ముస్లీం యువకులు, పిల్లలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా తరలిరావడంతో పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు గావించింది. ప్రార్థన స్థలానికి ఇచ్చోడ, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, తాంసి, తలమడుగు, జైనథ్ మండలాల నుండి భారీగా ముస్లీం సోదరులు తరలిరాగా ప్రార్థన స్థలం కిక్కిరిసిపోవడంతో జాతీయ రహదారిపైనే ప్రార్థనలు గావించారు. దీంతో పోలీసులు పట్టణ నడివీదుల గుండా ట్రాఫిక్‌ను దారిమళ్లించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రమబద్దీకరణ చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే, జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానంలో వేలాది మంది సామూహిక ప్రార్థనలు గావించిన సందర్భంగా రంజాన్ పండగ విశిష్టతను, ఉపవాస దీక్షల ప్రాశస్త్యాన్ని ముస్లిం మతగురువు ఇమామ్ వౌలాన జలీల్ ఆహ్మద్ ప్రవచనాలు గావించారు. శాంతిసామరస్యంతో ముస్లింలు సోదరభావంతో మెలుగాలని, నెలరోజుల ఉపవాస దీక్షల వల్ల భగవంతునికి దగ్గరవుతామన్నారు. పేదవర్గాల పట్ల దయ, కరుణ చూపాలని సూచించారు. ఈ సందర్భంగా సామూహిక ప్రార్థనల అనంతరం ముస్లింలు అక్కడే వేచి ఉన్న ముస్లిమేతర స్నేహితులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీ నేతలను కలుసుకొని పండగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందంతో ఒకరినొక్కరు ఆలింగనం చేసుకున్నారు. రాజకీయ పార్టీల నేతలు ఈసారి కూడా పోటీపడి పట్టణంలో రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సిలు, కటౌట్లద్వారా ప్రచారం చేసుకున్నారు. ఈద్గా, జమ మసీద్‌ల వద్ద రాజకీయ నేతల సందడి కనిపించింది. ఈద్గా మైదానం వద్ద వేలాది మంది ప్రార్థనలు చేయడంతో వారిని కలుసుకొని ముస్లీం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయా పార్టీల నాయకులు ఆప్యాయంగా వారి ఇండ్లలోకి వెళ్ళి పండగ శుభాకాంక్షలు తెలుపుతూ పాయసం, విందు భోజనం ఆరగించి పండగ మత సామరస్యాన్ని చాటి చెప్పారు. ఇదిలా ఉంటే, రంజాన్ పండగ సందర్భంగా ఎస్పీ ఎం.శ్రీనివాస్ పర్యవేక్షణలో జిల్లా అంతటా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు గావించడంతో రంజాన్ వేడుకలు జిల్లా అంతటా ప్రశాంతంగా ముగిశాయి.