కరీంనగర్

ఎమర్జెన్సీపై విస్తృత చర్చ జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూన్ 26: నాలుగు దశాబ్దాల క్రితం దేశంలో నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీపై విస్తృత చర్చ జరుపుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. ఆపార్టీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని ఫిల్మ్‌భవన్‌లో ఎమర్జెన్సీ వ్యతిరేక నిరసన దినం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, నాటి కాంగ్రెస్ హాయాంలోతప్పుడు విధానాలతోఅధికారం చేపట్టిన ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని రద్దు చేసే దిశగా ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతోభయపడి, ఎమర్జెన్సీ విధించందని అన్నారు. దీనిపై నాటి నుంచి నేటివరకు ఏరాజకీయ పార్టీ కూడా నోరు విప్పకపోవటం శోచనీయమన్నారు. కేవలం బిజెపి మాత్రమే నాటి చీకటి రోజులపై ఏటేటా ఎలుగెత్తుతూ, నిరసన కార్యక్రమాలు తలపెడుతుందన్నారు. భవిష్యత్‌లో మరోసారి ఆ పరిస్థితులు తలెత్తకూడదనే భావనతో దేశ ప్రజలను అప్రమత్తం చేస్తుందన్నారు. 78లో జనతాపార్టీ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం దేశంలో మరోసారి అత్యయిక పరిస్థితులు తలెత్తకుండా ఆర్టికల్ 350 నిబంధనకి సవరణలు చేసిందని అన్నారు. కుటుంబ పాలన ఉన్నచోటనే అవినీతి,అక్రమాలు పెరిగి నిరంకుశ పాలన మొదలవుతుందన్నారు. నాటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఎందరోమంది సమాజ పరిరక్షణ కోసం నిస్వార్థంగా ఉద్యమకారులుగా మారి జైలు పాలయ్యారని అన్నారు. వారి ఉద్యమస్పూర్తిని ఆదర్శంగా తీసుకుని కుటుం బ పాలన కోసం ఆరాటపడుతున్నవారికి అడ్డుకట్ట వేయాలని ఉద్భోదించారు. దేశాన్ని భ్రష్టుపట్టించిన కాంగ్రెస్‌కు మరోసారి అవకాశమివ్వకుండా అన్నిరంగాల్లో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మోదీ ప్రభుత్వానికి ప్రజలను అండగా నిలిపేందుకు కార్యకర్తలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఎమర్జెన్సీలో సాయు ధ పోరాటంలో పాల్గొని, జైలు జీవితం గడిపిన బండ గణపతిరెడ్డి, చిట్టి గోపాల్‌రెడ్డి, పర్శరామ్, జోగినపల్లి జోగమ్మ, నాయిని చంద్రయ్య, కోమల అంజనేయులు, బాస సత్యనారాయణరావులతో పాటు పలువురిని ఆయన సన్మానించారు. బిజెపి జిల్లాప్రధానకార్యదర్శి ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కొట్టె మురళీకృష్ణ, గుజ్జ సతీష్,సాయిని మల్లేశం,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొరివి వేణుగోపాల్, చిబ్బిడి అనితారెడ్డి, గాజుల స్వప్న, పెండ్యాల సాయికృష్ణారెడ్డి, బేతి మహేందర్‌రెడ్డి, జితెందర్‌రెడ్డి, సుంకపాక విద్యాసాగర్,సిరికొండ శ్రీ్ధర్‌రావుతోపాటు పలువురు పాల్గొన్నారు.