కరీంనగర్

మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మికుంట, జూన్ 26: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల, మతాలను గౌరవిస్తుందని, ముస్లీం మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తుందని ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం జమ్మికుంట పట్టణంలో ముస్లీం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈద్ ఉల్ పీతర్ (రంజాన్ ) పండుగను ఈద్గా మజీద్ కమిటి అధ్యక్షులు యం ఎ హుస్సేన్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటలను ముస్లీం ఈద్గా కమిటి అధ్యక్షులు హుస్సేన్, ముస్లీంలు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజక వర్గంలో ముస్లీంలకు ప్రత్యేకంగా రెండు మైనార్టీ పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. మైనార్టీ ఆడ పిల్లల పెండ్లికోసం రాష్ట్ర ప్రభుత్వం 75వేల 116రూపాయలు అందజేస్తుందన్నారు. నియోజక వర్గంలో మైనార్టీల ఈద్గాలు, మసీదులు, ఈద్గాల ప్రహరీ గోడల నిర్మాణం, వౌలిక వసతుల కోసం ఎంత మేరకైన ఖర్చు చేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. బిజిగిరిషరీఫ్ గ్రామంలోని దర్గాను దేశంలోనే పేరుగాంచే విధంగా గొప్పగా అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణ సాధనలో ముస్లీంలు పాత్ర కీలకమైందని, హక్కుదారులుగా అడిగి అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. పేద ముస్లీం సోదరులను మీరే గుర్తించి, వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కట్టించేందుకు లబ్దిదారులను గుర్తించాలని సూచించారు. నియోజక వర్గంలో పేద, చదువుకున్న యువకులు, ఐదు వందల మందికి 80శాతం సబ్సిడితో లక్ష రూపాయల బ్యాంక్ లోన్‌లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. జమ్మికుంట కోరపల్లి రోడ్‌లోని ఈద్గాలో 2000 మంది ముస్లీం మత పెద్దలు, ముస్లీం సోదరులు హాజరైనారు. కార్యక్రమంలో వ్యవసాయ కవిటీ మార్కెట్ చైర్మన్ పింగిళి రమేష్, రాష్ట్ర సహకార సం ఘాల అధ్యక్షులు తక్కళ్లపెళ్లి రాజేశ్వర్‌రావు, నగరపంచాయితీ చైర్మన్ పోడేటి రామస్వామి, నగరపంచాయితీ కమీషనర్ పిల్లి శివయ్య, నగరపంచాయితీ వైస్ చైర్మన్ బచ్చు శివ శంకర్, పొనగంటి మల్లయ్య, ఎక్కటి సంజీవరెడ్డి, ముస్లీం సోదరులు నసీరోద్దిన్, ఖాదీర్, రుస్తుం, సయ్యద్ సమీర్, యండి ఉస్మాన్ పాషా, తదితరులు రంజాన్ పర్వదిన వేడుకల్లో పాల్గొన్నారు.