కరీంనగర్

ఈద్ ముబారక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 26: ముస్లీం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే ఈద్-ఉల్-్ఫతర్ (రంజాన్) వేడుకలను సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముస్లీం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరుపుకున్నారు. ఉదయం 8గంటల నుంచి ప్రారంభమైన ప్రత్యేక పార్ధనల సందండి 11గంటల వరకు కొనసాగింది. చిన్నా, పెద్ద అనే తారమత్యం లేకుండా నూతన దుస్తులు ధరించి, వేలాది సంఖ్యలో ముస్లీం సోదరులు రంజాన్ వేడకుల్లో ఆనందోత్సహాల నడుమ పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల కోసం తరలివచ్చిన ముస్లీం సోదరులతో కరీంనగర్ జిల్లా కేంద్రం శివారులోని సాలెహ్‌నగర్ ఈద్గా కిటకిటలాడింది. ఇక్కడికి చేరుకున్న ముస్లీం సోదరులు ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు ముగిసిన అనంతరం ముస్లీం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వీణవంక మండలం చల్లూరు గ్రామంలో జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లీంలకు శుభాకాంక్షలు తెలిపి ప్రసంగించారు. మిగితా ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్‌లో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్‌తోపాటు ఇతర పార్టీల నాయకులు తదితరులు పాల్గొని ముస్లీం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపార, వాణిజ్య సంస్థలకు చెందిన ప్రముఖులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు, స్వచ్ఛంద సంస్థలు ఈద్ ముబారక్ తెలుపుతూ బ్యానర్లు కట్టారు. కరీంనగర్ జిల్లా కేంద్రంతోపాటు జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, గోదావరిఖని, హుజురాబాద్, జమ్మికుంట, కోరుట్ల, మెట్‌పల్లి తదితర పట్టణాల్లోని ఈద్గాలు, ప్రముఖ మసీదులలో ఈద్-ఉల్-పీతర్ ప్రత్యేక నమాజు నిర్వహించారు. అలాగే గ్రామాల్లోని ప్రార్ధన స్థలాల్లో సైతం నమాజు కార్యక్రమాలను నిర్వహించారు. దీంతో ప్రార్థనా మందిరాలున్న ప్రాంతాలన్నీ సందడిని సంతరించుకున్నాయి. ముస్లీం సోదరులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేయగా, ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకుగాను పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రార్థన ప్రాంతాల మీదుగా వాహన రాకపోకలను నియంత్రించి ఇతర దారుల గుండా దారి మళ్ళింపు చర్యలు చేపట్టారు. కాగా, నెలరోజులపాటు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు కొనసాగించిన ముస్లీం సోదరులు రంజాన్ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తానికి రంజాన్ సందర్భంగా నెలరోజుల పాటు నగరం, పట్టణాల్లో నెలకొని ఉన్న సందడి సోమవారం నాటి ఈద్-ఉల్-పీతర్ వేడుకతో ముగిసింది.