వరంగల్

ఇసుక లారీలకు పెనాల్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటాపురం(నూగూరు), జూన్ 26: పరిమితికి మించి అక్రమంగా అదనపు పన్నుల ఇసుకను తరలిస్తున్న 19 లారీలను ఆదివారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మండల పరిధిలోని వీరభద్రవరం గోదావరి ఇసుక క్వారీ నుండి ఆన్‌లైన్ ఇసుక అనుమతి కంటే ఒక్కొక్క లారీకి నాలుగు నుండి ఏడు టన్నుల వరకు అదనంగా అక్రమ ఇసుకను అధికారులు కనుగొన్నారు. టన్ను ఇసుకకు 15 వందల రూపాయల చొప్పున రెవెన్యూ అధికారులు పెనాల్టీని విధించారు. పెనాల్టీ చెల్లించి అదనపు ఇసుకను నూగూరు ఇసుక లారీ కాంట వద్ద లారీల నుండి అదనపు ఇసుకను తొలగించాలని సోమవారం తహశీల్దార్ పాలకుర్తి భిక్షం, గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ పరిపాలన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం రంజాన్ సెలువ దినం కావడంతో ప్రభుత్వ కోశాధికారి కార్యాలయంలో పెనాల్టీ చలానాలు మంగళవారం తీసుకునే అవకాశం ఉంది. చలానాలు చెల్లించే వరకు లారీలను నూగూరు కాంట వద్ద రహదారిపై నిలిపివేశారు.
బకెట్ ఇసుకకు 1500 రూపాయలు
ఇసుక మాఫియా గోదావరి నుండి లారీల తరలింపులో జెసిబి ద్వారా అదనపు ఇసుకను నింపేందుకు ఒక్క జెసిబి అదనపు బకెట్‌కు వెయ్యి నుండి 15 వందల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టు అధికారుల లారీల స్వాధీనంలో బయటపడింది. అదనపు ఇసుకు లోడింగ్‌పై ఆయా లారీ డ్రైవర్ల వద్ద నుండి అక్రమ చెల్లింపు వ్యవహారాలు అధికారులు రాబట్టారు. వందలాది ఇసుక లారీలు ఏజన్సీ ప్రాంతం నుండి అడ్డూ అదపూ లేకుండా యధేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. మాముళ్ల మత్తులో అధికారులు మాఫియాకు వత్తాసు పలకడంతో మాఫియా ఇసుక దోపిడీకి తెర లేపింది.