నిజామాబాద్

శ్రీరాంసాగర్‌లోకి స్వల్పంగా ఇన్‌ఫ్లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్కొండ, జూన్ 26: మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి స్వల్పంగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ ఎగువ ప్రాంతమైన గోదావరి బేసిన్‌లో కురిసిన వర్షాల కారణంగా 2400క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరడంతో సోమవారం సాయంత్రానికి రిజర్వాయర్ నీటిమట్టం 1054.70 అడుగులు 9.06టిఎంసిలకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు 90 టిఎంసిలు కాగా, గత సంవత్సరం ఇదే రోజున రిజర్వాయర్ నీటిమట్టం 1046.60 అడుగులు 4.63 టిఎంసిల వద్ద నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.