విశాఖపట్నం

అవి చీకటి రోజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 26: ప్రధాని తన నియంతృత్వ పోకడలకు పరాకాష్ఠ దేశంలో అత్యవసర పరిస్థితి విధింపుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు. అప్పుఘర్ సమీపంలోని ఎంపి కార్యాలయంలో సోమవారం జరిగిన ఎమర్జెన్సీ డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అహంకార పూరిత పాలనకు అత్యవసర పరిస్థితి అద్దం పడుతుందన్నారు. తనకు వ్యతిరేకంగా పనిచేసే వ్యవస్థల్ని, వ్యక్తుల్ని అమానుషంగా వేధించిన చరిత్ర అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వేలాది మంది రాజకీయ నాయకులు ప్రభుత్వ వేధింపులకు తాళలేక అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సందర్భాలున్నాయన్నారు. రాజ్యాంగ పరమైన వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం చేసిన ప్రభుత్వం ప్రజా తిరుగుబాటును ఆణచివేసేందుకు సైతం వెనుకాడలేదన్నారు. ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నేత పివి చలపతిరావు, తదితరులు ఎమర్జెన్సీ సమయంలో తాము ఎదుర్కొన్న సమస్యలను కళ్లకు కట్టినట్టు వివరించారు. సమావేశంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, నగర బిజెపి అధ్యక్షుడు ఎం నాగేంద్ర, బిజెపి నాయకులు నరేంద్ర ప్రకాష్, పివి నారాయణ, ఎస్‌విఎస్ ప్రకాశరెడ్డి తదితరులు పాల్గొన్నారు.