విశాఖపట్నం

భూ కుంభకోణాలపై సిబిఐ విచారణ జరిపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 26: విశాఖలో జరుగుతున్న భూ కుంభకోణాలు, అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ, హైకోర్టు సిటింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. సోమవారం జీవిఎంసి గాంధీ విగ్రహం వద్ద పలు సంఘాల నేతలంతా కలిసి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వేల ఎకరాలను ఆక్రమించుకున్న వారిపై ప్రభుత్వం చర్యలు చేపట్టకుండా కాలయాపన చేస్తుందన్నారు. సిట్ విచారణ పేరుతో కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. కొమ్మాదిలో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని లేఅవుట్‌లు వేసి అమ్ముకుంటున్న వారిపై విచారణ చేపట్టకుండా వ్యవహరించడం విడ్డూరంగా ఉందన్నారు. మధురవాడలో వందల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకునే నాధులే కరవయ్యారన్నారు. పేద ప్రజల భూములను తిరిగి వారికి తక్షణమే అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రజల అభిప్రాయాన్ని పక్కనపెట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు కుంభకోణాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని, స్వచ్చ పరిపాలన పేరు చెప్పుకుంటున్న చంద్రబాబునాయుడు ఎందుకు సిబిఐ దర్యాప్తు జరపాలని ప్రశ్నించారు. విశాఖలో రెవెన్యూ భూముల వ్యవహరంలో ఇంత రాద్ధాంతం జరుగుతున్నా కనీసం రెవెన్యూశాఖామంత్రి ఒక్కసారి కూడా విశాఖలో పర్యటించకపోవడం దురదృష్టకరమన్నారు. లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జి, సిపిఐ నేతలు ఏజె స్టాలిన్, మార్కండేయులు, పైడిరాజు, సిపిఎం నాయకులు మణి, అప్పారావు, కుమారి, పలు సంఘాల నేతలు పాల్గొన్నారు.