శ్రీకాకుళం

జాతీయ రహదారి ప్రమాదాలను అదుపుచేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూన్ 26: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారిస్తానని కొత్తగా బాధ్యతలు స్వీకరించి జిల్లా పోలీసుబాసు డాక్టర్ సి.ఎం.త్రివిక్రమవర్మ చెప్పారు. గతంలో ప్రకాశం జిల్లాలో పనిచేసినప్పుడు ప్రత్యేకంగా ఎస్.ఐ.లను ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించగలిగామని, అదేతరహాలో ఈ జిల్లాలో కూడా ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. జిల్లాలో ఎక్కడికక్కడ బ్లాక్‌జోన్‌లను ఏర్పాటుచేస్తామని, జిల్లా పరిధిని అనుసరించి 18 పోలీసుస్టేషన్లకు బ్లాక్‌జోన్‌లను అప్పగించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా కళాశాలలు, గ్రామాలు ఉండే జాతీయరహదారి ప్రాంతాలలో స్పీడ్‌లిమిట్ బోర్డులను ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. అలాగే, జాతీయ రహదారిపై వాహనాలను పార్కింగ్ చేయడం ద్వారా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాకాకుండా జాతీయరహదారి గీతకు వెలుపలి వైపు వాహనాలను పార్కింగ్ చేయడం ద్వారా కొంతమేర ప్రమాదాను నివారించవచ్చన్నారు. ఆ విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. రోడ్డు ప్రమాదాలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూనే మరోవైపు జిల్లాలో శాంతిభద్రతలను కూడా పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గల గిరిజనుల్లో చైతన్యం కల్పించి వారి ద్వారా పోలిసింగ్ నిర్వహించే విధంగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్టు వివరించారు. మావోప్రభావితం కలిగిన గిరిజన గూడల్లోనే కాకుండా మైదానప్రాంతంలో గల గిరిజనుల్లో కూడా పోలీసింగ్ పట్ల ఆసక్తికనబరిచే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు జిల్లాలో నిర్వహించనున్నట్టు ఎస్పీ వర్మ తెలిపారు. ఇందుకు ప్రజలు, మీడియా సహకారం కావాలని కోరారు. ముందుగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఆయనతోపాటు హరి, శ్రీనివాస్‌లు మంత్రోచ్ఛరణలతో శ్రీకాకుళం జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌గా డాక్టర్ సి.ఎం.త్రివిక్రమవర్మ సోమవారం ఉదయం తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ జిల్లా ఎస్పీగా కొనసాగిన జె.బ్రహ్మారెడ్డి నూతన ఎస్పీ త్రివిక్రమవర్మకు బాధ్యలను అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించడం జరిగిందన్నారు. ఇంతకుముందు ప్రకాశం జిల్లాలో 14 నెలలు పనిచేసానని చెప్పారు. అదేవిధంగా విశాఖపట్నంలో డి.ఎస్పీగా, నర్సీపట్నంలో ఓ.ఎస్.డి.గా కూడా పనిచేసానని అప్పటి నుంచే జిల్లాతో తనకు అనుంబంధం ఉన్నట్లు గుర్తుచేసారు. విశాఖపట్నం జిల్లాలో పనిచేసే సమయంలో జిల్లాలో నిర్వహించే కొన్ని ఆపరేషన్లలో పాల్గొన్నానని చెప్పారు. అంతేకాకుండా విశాఖ డి.ఐ.జి. వారి ఆదేశాల మేరకు జిల్లాలోని రెండుమూడు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నానని అప్పటి నుంచే జిల్లాపై కొంత అవగాహన ఉందని తెలిపారు. జిల్లాపై మరింత అవగాహన పెంచుకొని ముందుకు వెళ్తానని చెప్పారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ త్రివిక్రమవర్మను డి.ఎస్పీ భార్గవరావునాయుడుతోపాటు, పాలకొండ, పలాస డి.ఎస్పీలు, ట్రాఫిక్ డి.ఎస్పీ శ్రీనివాసరావులు పుష్పగుచ్చాలు ఎస్పీకి ఇచ్చి గౌరవంగా కలిసారు. అనంతరం స్టేషన్ హౌస్ అధికారులు, ఇతర సిబ్బంది కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ వర్మను శుభాకాంక్షలు తెలిపారు.