కడప

తగ్గిన ధాన్యం ధరలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజుపాళెం, జూన్ 26: నానాటికీ పెరుగుతున్న వ్యవసాయ పెట్టుబడులకు అనుగుణంగా రైతులు పండించిన ధాన్యానికి గిట్టు బాటు ధరలు ఉండడం లేదు. పంటల సాగు కోసం తెచ్చిన అప్పులు తీర్చేందుకు పండించిన ధాన్యాన్ని ఇంటికి చేర్చక ముందే రైతులు పొలాల్లోనే అమ్ముకోవాల్సి వచ్చింది. అయితే ఆ తరువాత పెరిగిన ధరలు వ్యాపారస్తులకే ప్రయోజనం చేకూర్చాయే తప్ప రైతులకు ఎలాంటి ప్రయోజనం కలుగడం లేదు. ప్రస్తుతం మినుము, పసుపు, మిరప, నువ్వులకు సరైన గిట్టుబాటు ధరలు లేకపోవడంతో ఏ పంట సాగు చేయాలో రైతులకు అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది. ప్రస్తుతం అక్కడక్కడ పత్తి పంట సాగు చేసినా ఆ తరువాత రబీలో ఏ పంట సాగు చేయాలో రైతులకు అర్థం కాని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. తగ్గిన ధాన్యపు ధరల వల్ల ముందుముందు ఏ ధాన్యానికి ఎలాంటి ధరలు ఉంటాయో తెలియడం లేదు. ఒకప్పుడు రూ.14వేలు ధరలు పలికిన మినుము క్వింటా ధర రూ.4500 నుండి 4800లోపే ధరలు వున్నాయి. అలాగే గత ఏడాది క్వింటా శనగ రూ.10వేలు పలికిన ధర ప్రస్తుతం రూ.5800లు వుంది. అలాగే మేలిరకం ఎండు మిర్చి గత ఏడు క్వింటా ధర రూ.18వేలు ఉండగా ప్రస్తుతం క్విటా ధర రూ6వేలు లోపు ఉంది. అలాగే పసుపు కొమ్ములు క్వింటా గతంలో రూ.14వేలు నుండి రూ.16వేలు ఉండగా ప్రస్తుతం క్వింటా పసుపు ధర రూ.6200లు వుంది. అలాగే జొన్న విషయానికి వస్తే గత ఏడు, అంతకుముందు క్వింటా ధర రూ.2200లు వుండగా ప్రస్తుతం క్వింటా ధర రూ.1400లు ఉంది. ఇలా తగ్గిన ధరలతో గోదాముల్లో నిల్వ చేసుకున్న రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ధరలు వల్ల పండించిన ధాన్యాన్ని రైతులు అమ్మకాలు సాగించడం లేదు. అలాగే పత్తి కూడా ఇళ్లల్లోనే మగ్గి పోతోంది. అడపాదడపా వ్యాపారస్తులు పత్తిని కొనుగోలు చేసినా రైతులకు పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఇన్నాళ్లుగా నిల్వ వుంచుకున్న ధాన్యానికి తగ్గుముఖం పట్టిన ధరల వల్ల వ్యవసాయం భారంగా పరిణమిస్తోంది. రోజు రోజుకు పంట సాగుకు అయ్యే విత్తనం ఖర్చు, రసాయనిక ఎరువులు, పురుగుమందుల ధరలు పెరిగిపోతున్నాయో తప్ప ధాన్యం ధరలకు గిట్టుబాటు కావడం లేదు. ఎకర పసుపు పంట సాగుకోసం లక్షన్నర్ర లోపు పెట్టుబడి పెట్టాల్సి ఉండగా ఈ ధరల వల్ల ఎకరాకు రూ.50వేలు వరకు నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మిర్చి పంట సాగుకు ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడులు పెడుతున్నారు. అయితే అందుకు అనుగుణంగా ధరలు లేకపోవడంతో మిర్చి రైతులు విలవిలలాడిపోతున్నారు. పండించిన దిగుబడులు తెగేసి అమ్ముకున్నా రైతులకు అప్పులే మిగిలిపోతున్నాయి. ఇక భూమిని కౌలుకు తీసుకొని సాగుచేసిన వారి పరిస్థితి దారుణంగా వుంది. గత ఏడాది ఖరీఫ్ మొదలుకొని రబీవరకు ప్రకృతి అనుకూలించకపోవడంతో కొంత మంది రైతులు తమ పొలాలను బీడు భూములుగానే ఉంచుకోవాల్సి వచ్చింది. అరకొరగా అయినా దిగుబడులను తక్కువ ధరలకు అమ్ముకోలేక గోదాముల్లో ఉంచుకున్నా జూన్ ముగుస్తున్నప్పటికీ ధరల పెరుగుదలలో ఎలాంటి మార్పులు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందాల్సి వస్తోంది.