కడప

పోలీసుల బదిలీకి రంగం సిద్ధం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూన్ 26: జిల్లాలోని పలువురు అధికారులకు స్థానభ్రంశం కలగనున్నది. కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, పులివెందుల, జమ్మలమడుగు పోలీస్ సబ్ డివిజన్లకు నూతన డీఎస్పీలు, ఐపీఎస్ అధికారులు కూడా నియామకం చేయనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో పనిచేస్తున్న జిల్లా పోలీస్ బాస్ పిహెచ్‌డీ రామకృష్ణను నెల్లూరుకు ఓఎస్డీ ఆపరేషన్స్ బి.సత్యయేసుబాబును పదోన్నతిపై ప్రకాశం జిల్లాకు, పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్ ఓఎస్డీగా పదోన్నతిపై తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ విషయం పాఠకులకు విదితమే. మైదుకూరు డీ ఎస్పీగా బి ఎన్ శ్రీనివాసులు ఇటీవలే బాధ్యతలు చేపట్టడంతో ఆయన మినహా మిగిలిన అధికారులందరినీ బదిలీ చేయనున్నారు. బదిలీ అయిన ఎస్పీ పిహెచ్‌డి రామక్రిష్ణ మైదుకూరు డీఎస్పీ రామక్రిష్ణను, జమ్మలమడుగు సర్కార్ అవినీతి అక్రమాల ఆరోపణలతో వారిరువురినీ డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేశారు. ప్రొద్దుటూరు డీఎస్పీ పూజిత తెలంగాణ కేడర్‌కు సంబంధించడంతో ఆమెను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేశారు. ప్రస్తుతం మైదుకూరు మినహా అన్ని పోలీస్ సబ్‌డివిజన్లకు అధికారుల పార్టీ నేతల సిఫారస్సుల మేరకే నూతన అధికారులను నియామకం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే అవినీతి, అక్రమాల ఆరోపణలు ఉన్న డజన్ పైబడి సీఐలు, 20 మంది పైబడి ఉన్న ఎస్‌ఐలపై ఇప్పటికే ఎస్పీ పిహెచ్‌డీ రామక్రిష్ణ కర్నూలు డీఐజీ రమణకుమార్ ద్వారా రాయలసీమ ఐజీ శ్రీ్ధర్‌రావుకు నివేదిక పంపినట్లు తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంబంధిత ఎస్‌ఐలు, సీఐలు ఎర్రచందనం స్మగ్లింగ్, క్రికెట్ బెట్టింగు, మట్కా గ్యాబ్లింగ్ తదితర అసాంఘిక కార్యకలాపాలకు సహకరిస్తున్నారని వారిని బదిలీ చేయాలని ఎస్పీ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కొంత మంది సీఐలు, ఎస్‌ఐలు అధికార పార్టీ నేతలు ఈ అధికారులకు అండగా ఉంటూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన పీహెచ్‌డీ రామకృష్ణ నిక్కచ్చిగా వ్యవహరిస్తూ అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ రావడం వలన అధికార పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. స్వయంగా ఎస్పీనే అవినీతి అక్రమాల అధికారుల చిట్టాను ప్రభుత్వానికి నివేదికలు పంపడం కారణంగా వారిపై వేటు వేయకపోయినా బదిలీలు చేయడం ఖాయమని అందరూ అంటున్నారు. ఇప్పటికే సంబంధిత అధికారులు తమకు అనుకూలమైన ప్రాంతాల్లో బదిలీ చేయించుకోవడానికి అధికార పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే గతంలో కాంగ్రెస్ హయాంలో పనిచేసిన ఒక సామాజిక వర్గానికి చెందిన అధికారులు మాత్రం అధికార పార్టీ నేతలు కూడా ఎత్తుకొని మోస్తూ నేతలకు కావాల్సిన ప్రాంతాలకే బదిలీలకు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. కొంత మంది అధికార పార్టీ నేతలు 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తమ ప్రత్యర్థి వైసీపీ నేతల దూకుడుకు కళ్లెం వేయడానికి తమకు అనుకూలమైన ఎస్‌ఐలు, సీఐలనే తెచ్చుకోవడానికి సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద రేపో, మాపో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు జిల్లాలో పెద్ద ఎత్తున బదిలీలు కానున్నారు. అలాగే జిల్లాకు నూతన ఎస్పీగా విశాఖపట్టణం రూరల్ ఓఎస్డీ బాపూజీ ఛార్జ్ తీసుకున్న అనంతరం ఆయన సైతం అవినీతి అక్రమార్కుల భరతం పడతారని అటువంటి అధికారులు జిల్లా నుంచి పొరుగు జిల్లాలకు వెళ్లడమే శ్రేయష్కరమని ఎవరికి తోచిన ప్రయత్నాలు వారు ఉన్నారు.