కడప

ప్రభుత్వ పనితీరుపై 1100 ద్వారా ఫోన్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూన్ 26: అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రభుత్వ పనితీరు శాఖల వారీగా రాజధాని విజయవాడ నుంచి 1100 ద్వారా జిల్లాలోని అధికారులు, అనధికారులు, ఉపాధ్యాయులకు సోమవారం ఫోన్ల తాకిడి పెరిగింది. 1100విభాగంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది జిల్లాలోని శాఖల వారీగా సంబంధిత శాఖల పనితీరు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ముఖ్యంగా ఉపాధ్యాయులకు రేషనలైజేషన్, బదిలీలపై వెబ్‌కౌన్సిలింగ్, ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల పనితీరు, ఉపాధ్యాయుల పనితీరుపై ఫర్‌పార్మన్స్ పాయింట్లపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆ శాఖ, ఈ శాఖ అని లేకుండా ప్రతి శాఖ సదరు ఉద్యోగి జాబ్‌చార్ట్‌పై వారు చేపడుతున్న పనులు వారి విధినిర్వహణపై ప్రశ్నల వర్షాలు కురిపించారు. అలాగే గ్రామీణ ప్రాంతంలోని డ్వాక్రా మహిళలు, రైతులతో రుణాలమాఫీ, రుణాల పంపిణీ, వారి జీవనోపాధులపై, ప్రభుత్వం పనిచేస్తున్న విధానం, విధానాల్లో ఏవైనా మార్పులు, చేర్పులు వారి వ్యక్తిగత విషయాలు, ఆర్థిక పరిస్థితులు, వారి యోగక్షేమాలను కూడా 1100 ద్వారా నేరుగా ప్రశ్నిస్తూ వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. చాలా మందికి 1100 నుంచి ఫోన్ల రాకతో ఈ ఫోన్లో మాటలు రికార్డు కావడం, వాటిని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు, ఐటీ మంత్రి ఎన్.లోకేష్‌లతో పాటు సంబంధిత శాఖల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పరిశీలిస్తారని చాలా మంది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 1100కు ఫిర్యాదులు చేయడానికి బ్రహ్మాస్త్రంగా మారినా ఆ ఫోను నుంచే నేరుగా ప్రభుత్వ ఉద్యోగులకు, రైతులకు, విద్యార్థులకు, మహిళలకు ఫోన్లు రావడంతో కొంత మంది తమ కష్టాలను కూడా ఫోన్ల ద్వారా తెలిపినట్లు తెలుస్తోంది. 1100 నుంచి ఫోన్ చేసే వారు ప్రతి ఒక్కరినీ ప్రభుత్వ పనితీరును, సంబంధిత ప్రాంతాల పరిస్థితులను కూడా అత్యంత చాకచక్యంగా కనుక్కుంటూ వారి నుంచే జవాబులు రాబడుతూ రికార్డు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ యేడాది పంటల సాగుపై ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పెన్షన్లు, కిలో రూపాయి బియ్యం, విత్తనాలు, ఎరువులు పంపిణీపై అడగడంతో పాటు సంబంధిత అధికారులు, సిబ్బంది పనితీరుపై కూడా వారు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వౌలిక సదుపాయాలపై 1100 నుంచి ఫోన్లు చేసిన వారికి వివరించడం కూడా జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ, సంక్షేమ పథకాలు, అభివృద్ధి, నీరు-చెట్టు, పంట సంజీవని, ఎన్‌టిఆర్ గృహ నిర్మాణ పథకం, తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్, చంద్రన్నబీమా, ఎన్‌టిఆర్ ఆరోగ్యశ్రీ, బడిపిలుస్తోంది, పంటలబీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, నీరు-ప్రగతి తదితరాలపై 1100 నుంచి ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. అయితే ఈ ఫోన్లు వైసీపీ నేతలకు వస్తున్నా వారు సైతం ఎక్కువ మంది తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగానే చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. మిగిలిన ఆ పార్టీ, ఈ పార్టీ అని లేకుండా గతంలో కంటే ఇపుడు ప్రభుత్వ పనితీరుపై 1100 నుంచి ఫోన్లు చేస్తున్న ప్రతినిధులకు ఈ ప్రభుత్వ పనితీరుపై ఓ పక్క కితాబిస్తూ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు గతంలో కంటే ఇపుడు అర్హులకే దక్కుతున్నాయని సమాధానాలు ఇస్తున్నారు. మొత్తం మీద 1100 నుంచి జిల్లా వ్యాప్తంగా ఫోన్లు రాకతో ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.