కడప

ఘనంగా రంజాన్ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూన్ 26: ముస్లిం మైనార్టీలకు రంజాన్ మాసం ఎంతో పర్వదినంగా నెల రోజుల పైబడి ఐదు పర్యాయాలు నమాజు చేసుకొని పవిత్ర దివ్య ఖురాన్‌ను పఠనం చేసి ఉపవాసాలతో మానవత్వం, సమాననత్వం చాటుకొని సోమవారం ఈద్గాల వద్ద పెద్ద ఎత్తున ప్రార్థనలతో ఉపవాసాలను వదిలారు. రంజాన్ మాసంలో ఇచ్చిన దానాల్లో పిత్రదానం ముఖ్యంగా భావించి పెద్ద ఎత్తున దానాలు చేసి మానవత్వాన్ని, సమానత్వాన్ని చాటుకొని ఆదివారం నెలవంక దర్శనం చేసుకొని సోమవారం రంజాన్ పండుగను జిల్లా వ్యాప్తంగా ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసుకున్నారు. సోమవారం ఉదయం ముస్లింలు ఎంతో పవిత్రంతో నూతన దుస్తులు ధరించి ఈద్గాలకు వెళ్లి ప్రార్థనల అనంతరం మిఠాయిల రుచులతో పంచే మధురంతో నిండు మనసుతో టోపీలు ధరించి ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం పరస్పరం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా అన్ని మసీదులు ఈద్గాల వద్ద ప్రభుత్వంచే పద్ద ఎత్తున అలంకారాలు చేసి ఈదుల్ ఫితార్ సందర్భంగా విద్యుత్ కాంతులీనుతున్న విధంగా కడప పెద్దదర్గాను జిల్లా వ్యాప్తంగా అన్ని దర్గాలు, మసీదులను అలంకరించారు. షహమీరియా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షాహుస్సేనీబాష షహనీరీసాహెబ్ జిల్లా కేంద్రంలోని పెద్ద మసీదులోను ఈద్గా వద్ద పెద్ద దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లాహుసేని సాహెబ్, ఆస్థాన్ బుఖారియా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ముస్త్ఫా హుసేనిబుఖారి మతగురువు హజరత్ సయ్యద్‌షా వలీఫుల్లాహుసేని సాహెబ్ తదితరులు నగరంలోని మసీదులలో సోమవారం వేకువజామున నమాజు చేసి వారంతా ఈద్గా వద్దకు వెళ్లగా సంబంధిత ఈద్గాకు వేలాది మంది ముస్లింలు నూతన దుస్తులతో పాటు తలకు టోపీలు ధరించి ప్రార్థనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పీఠాధిపతులు, మతాధిపతులతో కలిసి సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఖురాన్‌లో కనపరిచిన నీతివాక్యాలను నియమ నిబంధనలను ముస్లింలు ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో పాటించాలని ప్రతి ఒక్కరూ జకాత్ తమ ఆదాయాన్ని శుద్ధి చేసుకొని తమ ఆదాయంలో ఆపదలో ఉన్న వారికి ఖర్చు చేయాలని ప్రతి ఒక్కరూ సహాయ గుణంతో తోటి మానవులను ఆదుకొని మానవత్వం, సమానత్వం, దాతృత్వం కలిగి పవిత్రంతో జీవనం కొనసాగించాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వ్యాపార కూడలిలో గోరింటాకులు, కొత్త దుస్తులు, అత్తర్లు కొనుగోలు చేసి తమ తోటి మైనార్టీలకు పంపిణీ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లాలోని కడప, రాయచోటి, ప్రొద్దుటూరు, మైదుకూరు, పులివెందుల, రాజంపేట, రైల్వేకోడూరు, బద్వేలు, జమ్మలమడుగు, కమలాపురం తదితర ప్రాంతాలలో మత గురువులు, మత పెద్దలు సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఉదయం 8 గంటల నుంచి 10 గంటలలోపు ఈద్గాలకు చేరుకొని సామూహికంగా ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీ నేతలు పోటాపోటీగా ముస్లింలను, ముస్లిం నేతలను ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లింలలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, పలువురు బడా రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేసి పోటీపడి విందులకు ఆహ్వానించారు. నేతలు కూడా తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి పోటీపడి అన్ని రాజకీయ పార్టీల నేతలు వెళ్లి మైనార్టీల నేతలతో చేతులు కలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ పిహెచ్‌డీ రామకృష్ణ, ఓఎస్డీ బి.సత్యయేసుబాబు, పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్, కడప డీఎస్పీ అశోక్‌కుమార్, ప్రొద్దుటూరు ఇన్‌ఛార్జ్ డీఎస్పీ శ్రీనివాసులు, మైదుకూరు డీఎస్పీ బి ఎన్ శ్రీనివాసులు, రాజంపేట డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తదితరులు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా మసీదులు, ఈద్గాల వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. అదే తరహాలో మైనార్టీలు అధికంగా ఉన్న పట్టణాలు, మండలాలు, చివరకు మేజర్ గ్రామ పంచాయతీల్లో సైతం పోలీసు గస్తీలు ఏర్పాటు చేయడంతో ముస్లింలు రంజాన్ పండుగను ప్రశాంతంగా జరుపుకున్నారు.