గుంటూరు

రాజధానికి మరో నాలుగు హైలెవెల్ వంతెనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 26: గుంటూరు కేంద్రం నుంచి అన్ని వైపులా రాజధాని అమరావతికి కనెక్టివిటీని ఏర్పాటు చేస్తున్నారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి రహదార్ల విస్తరణ చేపట్టటం ద్వారా సచివాలయం, శాసనసభకు ఉండవల్లి మీదుగా ప్రధాన రహదారితో పాటు మిగిలిన రోడ్లను పటిష్టం చేస్తున్నారు. గుంటూరు నుంచి సచివాలయానికి తాడికొండ మీదుగా ఆర్ అండ్ బి రహదారి, కంతేరు మీదుగా ఉన్న పంచాయతీ రోడ్ల విస్తరణ అంశంపై అధికారులు పరిశీలన జరుపుతున్నారు. అమరావతి- అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే భూ సేకరణ పూర్తయి పనులు ప్రారంభించేలోగా జిల్లాలో రహదార్లు, వంతెనల నిర్మాణం చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 3వేల 664 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బి రహదార్లు ఉన్నాయి. గత ఏడాది సంభవించిన వరదల కారణంగా కోతపడిన రహదార్ల మరమ్మతులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేశారు. అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవే మలుపులు లేకుండా నేరుగా అమరావతికి ఏర్పాటు కానుండటంతో అందుకు తగ్గట్టుగా వంతెనల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి 2014-15 సంవత్సరంలో రెండు హైలెవల్ వంతెనల నిర్మాణంతో 820 కిలోమీటర్ల మేర 138.5 కోట్లతో విస్తరణ పనులు జరిగాయి. 2015-16కు నాలుగు హైలెవల్ వంతెనలతో పాటు 255 కోట్లతో 397 కిలోమీటర్ల మేర రహదార్లకు మరమ్మతులు నిర్వహించారు. ఈ ఏడాది మరో నాలుగు హైలెవల్ వంతెనల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. అమరావతి మండలం పెదమద్దూరు, పెదవడ్లపూడి- రేవేంద్రపాడు, సత్తెనపల్లి శివార్లలో ఈ వంతెనల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు ఆర్ అండ్ బి ఎస్‌ఇ రాఘవేంద్రరరావు తెలిపారు. కాగా పేరేచర్ల- కొండమోడు రహదారిని నాలుగు లైన్లుగా విస్తరణ జరుపుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించనున్న ఈ రహదారి వల్ల గుంటూరు నగరం నుంచి నేరుగా దాచేపల్లి వరకు తెలంగాణ సరిహద్దు ప్రాంతానికి నాలుగు లైన్ల రహదారి విస్తరణ సౌలభ్యం ఏర్పడుతుంది. ఇందుకయ్యే భూ సేకరణపై అధికారులు దృష్టి సారించారు. ఎక్స్‌ప్రెస్ హైవేతో పాటు ఐదోనెంబరు జాతీయ రహదార్లు నేరుగా అమరావతితో అనుసంధానమవుతాయి. ఇక ఇచ్ఛాపురం నుంచి తడ వరకు వెళ్లే కోస్తా జాతీయ రహదారి ఐదో నెంబర్ జాతీయ రహదారితో అనుసంధానం కావటం వల్ల అన్ని వైపుల నుంచి అమరావతికి రాకపోకలకు వీలు కలుగుతుంది.