గుంటూరు

దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఓ పీడకల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), జూన్ 26: భారతదేశ చరిత్రలో ఎమర్జన్సీ ఓ పీడకల అని అవగాహన సంస్థ ఆధ్వర్యాన సోమవారం అరండల్‌పేటలోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సభలో రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచలి శివాజీ పేర్కొన్నారు. సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో శివాజీ మాట్లాడుతూ దేశంలో 1975 జూన్ నుండి 1977 మార్చి వరకు అమలులో ఉన్న ఎమర్జన్సీ కాలం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అన్నారు. దేశంలో తిరిగి ప్రజాస్వామ్యం పునరుజ్జీవానికి కారకులు సామాన్య ప్రజలేనన్నారు. ఎమర్జన్సీలో జైలు జీవితం గడిచిన శివాజీ తన అనుభవాలను వెల్లడించారు. 1975 జూన్ 25వ తేదీ రాత్రి గుంటూరులోని తన స్వగృహానికి వచ్చి తనను అరెస్ట్ చేశారని, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నందున అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారన్నారు. పోలీసులు తనను రెండు చోట్ల మార్చి చివరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారన్నారు. జైలులో అనేక మంది ప్రముఖులను కలిశానని, వారిలో మాకినేని బసవపున్నయ్య, కొల్లా వెంకయ్య, మాదాల నారాయణస్వామి వంటి వారితో కలిసి పలు అంశాలపై చర్చించే అవకాశం తనకు కలిగిందన్నారు. అయితే తన అరెస్ట్‌కు భారతీయ లోక్‌దళ్ కార్యదర్శిగా తన పత్రికా ప్రకటనలు, చేయించిన ఆందోళనలు కాక చెరుకుపల్లి పోలీసుస్టేషన్‌పై దాడిచేసే వ్యూహం పన్నానని కూడా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. తర్వాత తనను ఎన్నో ఇబ్బందులు పెట్టారని, మీసా వారెంట్ కింద అరెస్ట్ చేసి ఎన్నో చోట్లకు తిప్పారన్నారు. తాను 9 మాసాల జైలు జీవితాన్ని గడిపానన్నారు. మొత్తమీద ఎన్నో ప్రయత్నాల తర్వాత 1977 ఏప్రిల్ 8న నన్ను విడుదల చేస్తూ హైకోర్టు ఫుల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కూడా కాదని రాష్ట్రప్రభుత్వం మరలా తనను నిర్బంధంలోకి తీసుకోవాలని చూసిందన్నారు. దీనిపై తాను సుప్రీంకోర్టుకు కూడా అప్పీల్ చేశానన్నారు. తనలాగా ఎందరో బాధలకు గురయ్యారని, పలు కోర్టులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు మెజిస్ట్రేట్లను కలవడం, వాదించడంతో పోరాటం కొనసాగించానని తెలిపారు. రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు ఎ హరి మాట్లాడుతూ శివాజీ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నందుకు, ప్రభుత్వం ఎమర్జన్సీని విధించడాన్ని విమర్శించినందుకు, అలాగే ఇందిరాగాంధీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసినందుకు అరెస్ట్ అయ్యారన్నారు. ఈ చర్చాగోష్ఠిలో అవగాహన సంస్థ ఉపాధ్యక్షుడు పిఎస్ మూర్తి, విశ్రాంత ఎంఇఒ రామాంజనేయ సూరి తదితరులు పాల్గొన్నారు.