కర్నూల్

మంత్రాలయంలో భక్తుల తాకిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, జూన్ 26: పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయం సోమవారం భక్త సంద్రంగా మారి కిటకిటలాడింది. వరసగా మూడు రోజులు సెలువులురావడంతో పుర వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామి దర్శనార్థం ఆంధ్ర, కర్నాటక తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర తదితర పాప్రాంతాల నుండి వచ్చిన భక్తులు తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
భక్తులు ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని పసుపుకుంకుమ సమర్పించకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీరాఘవేంద్ర స్వామి మూలబృందావనం దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. స్వామి మూల బృందావనానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేసి బంగారుకవచాలు, వివిధ రకాల పూలతో బృందావనాన్ని అలంకరించి పూజల చేసి భక్తులకు దర్శనం కలిగించారు. దర్శన నంతరం పరిమళ ప్రసాదాలు, అన్నదాన ప్రసాదం కోసం భక్తులు బారులు తీరారు. సాయంత్రం ఉత్సవమూర్తి శ్రీ ప్రహ్లాదరాయలను బంగారుపల్లకి, గజ, కొయ్య, వెండి, బంగారు, నవరత్న రథోత్సవాలపై అధిష్టించి ప్రత్యేక పూజలు చేసి అశేష భక్తుల మధ్య మఠం ప్రాకారంలో ఘనంగా ఊరేగించారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు రథోత్సవంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎటువంటి అంతరాయం కలుగుకుండా మఠం అధికారులు తగు చర్యలు చేపట్టారు.