కర్నూల్

పూర్తిస్థాయిలో పంపిణీ కాని రంజాన్ తోఫా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలుటౌన్, జూన్ 26:జిల్లాలో తెల్లరేషన్‌కార్డు కల్గిన నిరుపేద ముస్లిం కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ కానుక అందిస్తోంది. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా తెలుపురంగుకార్డు కాల్గిన 2,23,712 మంది ముస్లిం కుటుంబాలకు కానుకలు పంపిణీ చేయాల్సి ఉండగా రంజాన్ పర్వదినం ముగిసే నాటికి కూడా 1.9 లక్షల మందికి మాత్రమే పంపిణీ చేశారు. జిల్లాకు పంపిన కానుకలు దాదాపు 30 వేలు మిగిలిపోయాయి. ప్రతి పేద ముస్లిం కుటుంబం రంజాన్ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం రంజాన్ తోఫా పేర సరుకులు అందజేయగా, జిల్లా అధికార యంత్రాంగం వాటిని సకాలంలో పంపిణీ చేయలేకపోయారు. జిల్లాలో ఈ నెల 19వ తేదీ నుంచి హడావిడిగా కానుకల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఆ కిట్‌లో 5 కానుకలు అందించారు. గోధుమపిండి 5 కిలోలు, చక్కెర 2 కిలోలు, సేమ్యా కిలో, నెయ్యి వంద మిల్లీగ్రాముల చొప్పున ఒక సంచిలో ఉంచి కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉంది. ఆ కిట్‌లను జిల్లా కేంద్రం నుంచి డివిజన్‌లోని గోదాములకు, గోదాముల నుంచి నేరుగా చౌకదుకాణాలకు సకాలంలో పంపిణీ చేశారు. అయితే చౌకదుకాణాల డీలర్లు పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో కానుకలు మిగిలిపోయాయి. ప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో పంపిన కానుకలు చౌకదుకాణాల్లోనే నిల్చిపోయాయి. పౌర సరఫరాల అధికారులు మొదటి రెండు రోజులు పంపిణీపై హడావిడి చేశారు తప్ప మిగిలిన రోజుల్లో పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో కానుకలను వందశాతం పంపిణీ చేయలేకపోయారు.