విజయవాడ

ఆయుష్ వైద్య సిబ్బందికి న్యాయం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, జూన్ 26: ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్న ఆయుష్ కాంట్రాక్డ్ సిబ్బందిక3 న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి సిఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. 9ఏళ్లుగా పని చేస్తున్న వీరి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని సోమవారం సిఎ బాబుకు వ్రాసిన లేఖలో తెలిపారు. గత 15 నెలలుగా వేతనాలు వారికి చెల్లించక పోవడంతో వారి కుంటుంబాలు రోడ్డున పడ్డాయని అవేదన వ్యక్తం చేశారు. ఏపిలో ఎస్‌ఆర్‌హెచ్‌ఎబ్ పథకం కింద 2008 సంవత్సరం నుంచి 587 ఆయుష్ వైద్యశాలలో దాదాపు 800 మందికి పైగా పిహెచ్‌సి, మరియు సిహెచ్‌సిల న్యాయమైన డిమాండ్‌లను నేరవేర్చాలన్నారు. గత 9 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్దతిన పని చేస్తున్న వీరికి గత 15 నెలల నుండి బకాయిపడ్డ ప్రభుత్వం వారి ఉద్యోగ సర్వీసు కొనసాగింపు చేయకపోవడం దారుణమన్నారు. దీని కారణంగా వారు ఆర్థిక భారముతోనూ, మానసిక మనోవేదనలకు గురి అయ్యి రాష్ట్రంలో ఇప్పటికే నలుగురు ఉద్యోగులు మరణించినట్లు గుర్తు చేశారు. వీరికి తక్షణమే సుప్రీం కోర్టు తీర్పునను సరించి సమాన పనికి సమాన వేతనం అందించాలన్నారు.