విజయవాడ

28న నగరంలో శ్రామిక జనగర్జన్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 26: మూడేళ్ల కాలంగా తెలుగుదేశం ప్రభుత్వం కార్మి క సమస్యలను పరిష్కరించడంలో తీ వ్ర నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తూ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నందున దానికి నిరసనగా ఈనెల 28న నగరంలోని లెనిన్ సెంటర్ నుండి లేబర్ కమిషనర్ కార్యాలయం వరకు భారీ కార్మిక ప్రదర్శన, అనంతరం సభ నిర్వహించనున్నామని ఏఐటియుసి రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు పేర్కొన్నారు. సోమవారం విజయవాడ ఏఐటియుసి రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని వెంకట రామారా వు, ఉప ప్రధాన కార్యదర్శి రావులపల్లి రవీంద్రనాథ్, రాష్ట్ర కార్యదర్శి ఎస్. వెంకట సుబ్బయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్య అతిథిగా ఏఐటియుసి జాతీయ కార్యదర్శి అమరజిత్‌కౌర్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి, ఉపాధి, సంక్షేమం అంటూ ఊదరగొట్టే ఉపన్యాసాలకే పరిమితమైందని, నూతన ఉద్యోగాలు కల్పించకపోగా ఉన్న ఉద్యోగాల నుండి కార్మికులను తొలగించే కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ కార్మికుల పొట్టకొట్టే జివో 279ను తీసుకువచ్చారని, మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న 80వేల మంది కార్మికుల ఉపాధి కొల్లగొట్టే మెమో తీసుకువచ్చారని, ప దేళ్లుగా 2వేల మంది పనిచేస్తున్న ఎన్‌టిఆర్ వైద్య, ఆరోగ్య మిత్రలను తొలగించుటకు జివో 28ను తెచ్చారని ఆయన విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చట్టబద్దంగా పనిచేస్తూ కార్మికులకు 11 రకాల ప్ర యోజనాలు కల్పిస్తుంటే ఈ కార్మికులందరూ చంద్రన్న బీమా పథకంలో చేరాలని ఒత్తిడి చేయడాన్ని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. నగదు బదిలీ పథకం పేరుతో హమాలీ కార్మికుల భద్రతకు తిలోదకాలు ఇస్తున్నారని, ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీ ర్యం చేస్తున్నారన్నారు. లక్షలాది మం ది కార్మికుల వేతనాలు పెంపుదలకు ఉ ద్దేశించిన కనీస వేతన సలహా బోర్డును నియమించటంలో ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని, కాల పరిమితి ముగిసిన జివోల స్థానంలో కొత్త జివో లు విడుదల చేయకుండా ప్రభుత్వం కార్మికుల వేతనాలు పెరగకుండా నిరోధిస్తుందన్నారు. ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బిసి హాస్టల్స్‌లో, ఏపి జెన్‌కో, ట్రాన్స్‌కో విద్యుత్ కార్మికులకు, ఏపి టూరిజం, ఏపి ఖనిజాభివృద్ధి సంస్థల్లో మధ్యంతర భృతిని ఇచ్చి పిఆర్‌సి అమలు చే యకుండా జివో 151ను విడుదల చేసిందని, ఆ జీతాలు కూడా చెల్లించకుండా ప్రస్తుత వేతనాలపై 50 శాతం పెంచుతామని ప్రభుత్వం ప్రకటిస్తూ గందరగోళ పరిస్థితులు సృష్టిస్తుందన్నారు. 7వ వేతన సంఘం సిఫార్స్ మే రకు కనీస వేతనాలు రూ.18వేలు చె ల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణా ప్రభుత్వం పెంచిన విధం గా అంగన్‌వాడీలకు రూ.10వేలు, ఆశా వర్కర్లకు రూ.6,500, మధ్యాహ్న భోజ న పథక కార్మికులకు రూ.5వేలు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లక్షలాదిగా పనిచేస్తున్న హమాలీ, ఆ టో కార్మికులకు భవన నిర్మాణ కార్మికు ల తరహాలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పై డిమాండ్ల సాధనకు ఏఐటియుసి నాయకత్వాన 28న జరిగే శ్రామిక గర్జనలో వేలాదిగా కార్మికులు పాల్గొనాల ని, ప్రభుత్వం ఇకనైనా కార్మికుల, ఉ ద్యోగుల సంక్షేమానికి కట్టుబడి పనిచేయకపోతే తీవ్ర ఆందోళనకు పూనుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.