హైదరాబాద్

డెంగ్యూతో యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జూన్ 26: డెంగ్యూ విషజ్వరంతో చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతిచెందాడు. అధికారుల నిర్లక్ష్యంతో చాపకింద నీరులా వ్యాపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పద్మశాలిపురం బస్తీకి చెందిన క్యామ బాలేశ్వర్ కుమారుడు క్యామ నవీన్ కుమార్(22) ఇంటర్మీడియెట్ వరకు చదివాడు. ప్రస్తుతం టాటాస్కై సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. పది రోజుల నుంచి విషజ్వరంతో బాధపడుతూ స్థానికంగా పలు ఆసుపత్రులలో చికిత్స పొందాడు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు పరీక్షలు చేసి డెంగ్యూగా నిర్ధారించారు. స్థానిక ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ సహకారంతో ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి.. ఆసుపత్రిని సందర్శించి మెరుగైన వైద్యాన్ని నవీన్‌కు అందించాలని డాక్టర్లకు ఆదేశించారు. అయినప్పటికీ డెంగ్యూ జ్వరం తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు నవీన్‌ను మలక్‌పేట్‌లోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. సోమవారం తెల్లవారుఝామున మృతిచెందాడు.
కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే
డెంగ్యూ విషజ్వరంతో పది రోజులుగా చికిత్స పొందుతూ మృతిచెందిన నవీన్‌కుమార్ భౌతిక కాయాన్ని స్థానిక ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ సందర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ నవీన్‌కుమార్ చనిపోవడం బాధకరమని అన్నారు. ప్రభుత్వం నుంచి నవీన్ కుటుంబానికి ఆర్థిక సహాయానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అధికారుల నిర్లక్ష్యంతోనే తెరపైకి డెంగ్యూ
అధికారుల నిర్లక్ష్యం, అలసత్వంతో డెంగ్యూ చాపకింద నీరులా వ్యాపించి ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. బస్తీలలో పారిశుద్ధ్యం లోపించి దుర్గంధం వెదజల్లుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపన పోలేదని ప్రజలు మండిపడుతున్నారు. బస్తీలలో పందులు స్వైర విహారం చేస్తున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కిల్ వెటర్నరీ డిపార్టుమెంట్.. పందులను నివారించడంలో నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కిల్ అధికారులు చేయాల్సిన ఫాగింగ్, దోమల నివారణ మందు, మురికికుంటల్లో వేయాల్సిన ఆయిల్ బాల్స్, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైనా పట్టించుకోవడం లేదని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడేళ్ల కాలంలో 10 మందికి పైగా డెంగ్యూ విషజ్వరంతో మృతిచెందినా అధికారులలో చలనం లేకపోవడం శోఛనీయమని అన్నారు.