హైదరాబాద్

భక్తిశ్రద్ధలతో ఈద్-ఉల్-ఫితర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూన్ 26: రంజాన్ పర్వదిన వేడుకలు సోమవారం ఉప్పల్ పరిసర ప్రాంతాలలో ఘనంగా జరిగాయి. చిల్కానగర్, హబ్సిగూడ, రామంతాపూర్, ఉప్పల్ డివిజన్లలో ఈద్గాల వద్ద వందలాది మంది ముస్లిం సోదరులు భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రామంతాపూర్‌లో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఉప్పల్ రింగ్‌రోడ్డులోని మున్సిపల్ స్టేడియంలో ముస్లిం మైనారిటీ పీస్, వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో అధ్యక్షుడు ఖాజా మోయినొద్ధీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ బుడేసాహెబ్, ప్రధాన కార్యదర్శి నజీరుద్ధీన్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఉప్పల్ పెద్ద మసీద్, ఖులీ కుతుబ్ షాహీ మజీద్, రామంతాపూర్ మసీద్‌లో జరిగిన రంజాన్ వేడుకల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొని ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. రామంతాపూర్ ఇందిరానగర్‌లో జరిగిన రంజాన్ వేడుకల్లో ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ నర్సింగ్‌రావు, ఎస్‌ఐ ఆంజనేయులు, కార్పొరేటర్ గంధం జ్యోత్స్న నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు. చిల్కానగర్, ఉప్పల్ మసీదులో ముస్లింలు రంజాన్ వేడుకలను నిర్వహించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
పేదలకు బట్టలు పంపిణీ
రంజాన్ పర్వదినం సందర్భంగా సమాజ సేవే లక్ష్యంగా పనిచేస్తున్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు షేక్ బుడేసాహెబ్ ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, కాంగ్రెస్ ఇన్‌చార్జి బండారి లక్ష్మారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు జి.సరస్వతి, ఎం.అనలారెడ్డి చేతుల మీదుగా వెయ్యి మందికి ఉచితంగా బట్టలు పంపిణీ చేశారు. అనంతరం బుడేసాహెబ్ కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. ప్రతి ఏడాది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బుడేసాహెబ్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు.
జంట పురపాలక సంఘాల్లో..
జంట పురపాలక సంఘాలైన బోడుప్పల్, పీర్జాదిగూడలో రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మసీదులు, ఈద్గాల వద్దకు తరలి వచ్చిన వందలాది మంది ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.
అల్వాల్: సికింద్రాబాద్ కంటోనె్మంట్ పరిధిలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. బోర్డు పరిధిలోని బాలంరాయి ఇతర ప్రాంతాలలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే సాయన్న హాజరై ముస్లింలతో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం డిప్యూటీ సిఎం మహమూద్ అలీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, బోర్డు సభ్యుడు జె.మహేశ్వర్‌రెడ్డి, టిడిపి నాయకుడు ముప్పిడి మధుకర్ రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అల్వాల్ పరిధిలోని మచ్చబొల్లారం, ఇతర ప్రాంతాలలో ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి, టిఆర్‌ఎస్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్, జిహెచ్‌ఎంసి కోఆప్షన్ సభ్యురాలు జ్యోతి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
కెపిహెచ్‌బి కాలనీ: రంజాన్ పర్వదినం సందర్భంగా హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ, బాలాజీనగర్, కెపిహెచ్‌బి కాలనీ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ముస్లిం సోదరులు సోమవారం రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ముస్లింలు మజీద్, ఈద్గాలలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హైదర్‌నగర్, ఆల్వీన్‌కాలనీ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలోని ఈద్గాలు, మజీద్‌ల వద్ద ఏర్పాటు చేసిన రంజాన్ వేడుకలకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొని ముస్లింలతోప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్‌గౌడ్, సిఐ కుషాల్కర్, నాయకులు సంజీవరెడ్డి, నార్నే శ్రీనివాస్, లద్దె నాగరాజు, శ్రీనివాస్‌యాదవ్, వెంకట్రావు, కాశీనాథ్‌యాదవ్, రాజేందర్, అమీన్, మున్నీర్, షరీఫ్‌లు పాల్గొన్నారు.
కెపిహెచ్‌బి కాలనీలో..
కెపిహెచ్‌బి కాలనీ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో నిర్వహించిన రంజాన్ వేడుకలకు డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు పాల్గొని ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గఫూర్, సత్తార్, కుదుష్, మస్తాన్, భాషా, ఇష్మాయిల్, ఇబ్రహీం పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి: రంజాన్ పండుగను పురస్కరించుకుని సోమవారం శేరిలింగంపల్లి ప్రాంతంలోని పలు ఈద్గాల వద్ద ప్రార్థనలు చేశారు. న్యూహఫీజ్‌పేట ఆదిత్యనగర్‌లోని ఈద్గాలో జరిగిన ప్రార్థనల్లో మాదాపూర్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్‌గౌడ్ పాల్గొన్నారు. టిఆర్‌ఎస్ నాయకులు బాలింగ్ యాదగిరిగౌడ్, కృష్ణముదిరాజ్, వెంకటేశ్‌గౌడ్, దుద్దడ రాజు, ఈద్గా కమిటీ నాయకులు పాల్గొన్నారు. చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి.. వేముకుంటలో ముస్లిం నాయకులు అక్బర్‌ఖాన్, అన్వర్‌ఖాన్, గౌస్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇందిరానగర్‌లోని వార్డు మెంబర్ ఫరీదా బేగం, గాలిబ్ కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దీప్తిశ్రీనగర్‌లో టిఆర్‌ఎస్ నాయకుడు అన్వర్ షరీఫ్‌ను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. టిఆర్‌ఎస్ నాయకులు సురేష్, మిరియాల ప్రకాశ్, పోచయ్య, హరీశ్‌రెడ్డి పాల్గొన్నారు. శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ డివిజన్ పరిధిలోని పలువురు ముస్లిం నాయకుల వద్దకు వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ కౌన్సిలర్ దుర్గం వీరేశం గౌడ్, చింతకింది రవీందర్ గౌడ్ ఉన్నారు. మియాపూర్ కార్పొరేటర్ మేకా రమేశ్‌తో పాటు టిఆర్‌ఎస్ నాయకులు ఎం.గంగాధర్, టి.సంతోష్‌రెడ్డి, మహెందర్ ముదిరాజ్, కృష్ణ కలిసి టిఆర్‌ఎస్ నాయకుడు అన్వర్ షరీఫ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.రవికుమార్ యాదవ్ పార్టీ నాయకులు గంగల రాధాకృష్ణ, మహిపాల్ యాదవ్‌తో కలిసి మియాపూర్‌లోని యూత్ కాంగ్రెస్ నాయకుడు ఇలియాస్ షరీఫ్‌ను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
మహేశ్వరం: మండలంలో సోమవారం ముస్లింలు రంజాన్ పండుగను భక్తిప్రపత్తులతో జరుపుకొన్నారు. నెలరోజుల ఉపవాస దీక్షల అనంతరం నేడు ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా మహేశ్వరం, నాగారం, అమీర్‌పేట్, మంఖల్, దుబ్బచర్ల గ్రామాల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచే ఈద్గా మైదానాలకు చేరుకున్న ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వారి పూర్వీకులకు పూలు సమర్పించి ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. హిందూ-ముస్లింలు ఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకుని మతసామరస్యాన్ని చాటిచెప్పారు. కార్యక్రమంలో ఎంఎ సమీర్, సత్తార్, అబూబకర్, ఇసాక్‌అలీ, సలాం, గ్రామ సర్పంచ్ ఎస్.ఆనందం పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం: ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ (ఈద్-ఉల్-్ఫతర్) పర్వదినాన్ని నియోజకవర్గవ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. ఈద్గాతో పాటు వివిధ మసీదుల్లో, నియోజకవర్గ పరిధిలోని మంచాల, యాచారం మండల కేంద్రాలలోని ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ మాసాంతం ఉపవాస దీక్షల్లో ఉన్న ముస్లిం సోదరులు ఈద్-ఉల్-్ఫతర్‌ను ఘనంగా జరుపుకొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఒకరికి ఒకరు అలైబలై తీసుకొని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇబ్రహీంపట్నంలో ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లింలకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.