రంగారెడ్డి

సర్వమానవ సౌభ్రాతృత్వానికి ప్రతీక ఈద్ ఉల్ ఫితర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, జూన్ 26: సర్వమానవ సౌభ్రాతృత్వానికి ప్రతీక రంజాన్ పర్వదినమని రవాణా శాఖ మంత్రి పట్నం మహేదంర్ రెడ్డి ఉద్ఘాటించారు. సోమవారం తాండూరు పట్టణం చెనిగెష్‌పూర్ దారిలో ఉన్న నూతన ఈద్గా మైదానంలో జరిగిన రంజాన్ పర్వదినం ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. యావత్ ప్రపంచంలోనే అతి పెద్ద లౌకిక దేశంగా భారత దేశం ఉందని, సర్వమతాలు ఐక్యంగా కలిసి మెలిసి ఉన్నట్లు మంత్రి తెలిపారు. భారత్‌లో ఉన్నంత స్వేచ్ఛాయుత వాతావరణం ఏ దేశంలో ఉండదని చెప్పారు. మన దేశంలో హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా ఉండటం మత సామరస్యాన్ని కాపాడుతున్నారని చెప్పారు. కొంత మంది విద్రోహశక్తులు మనదేశంలో ఉన్న అన్ని మతాల ఐక్యతను దెబ్బతీయటానికి చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టడంతో వారి ఆటలు ఆటలు సాగటం లేదన్నారు. టిఆర్‌ఎస్ యువ నాయకుడు పైలెట్ రోహిత్ రెడ్డి.. ఈద్గా మైదానంలో రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని తాండూరు ఈద్గా మైదానం అభివృద్ధికి రూ.3లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం తన ప్రసంగాన్ని ప్రారంభించిన మంత్రి పట్నం కూడా ఈద్గా మైదానం అభివృద్ధికి రూ.5లక్షలు మంజూరు చేస్తామని వెల్లడించారు. అధికార టిఆర్‌ఎస్ నాయకులు పోటీ పడి ఈద్గా మైదానం అభివృద్ధికి అడగకుండానే లక్షలాది రూపాయలు బహూకరిస్తామని ప్రకటించటంతో అక్కడున్న వారంతా విస్మయం వ్యక్తం చేశారు.
షాద్‌నగర్: రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. సోమవారం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసిన ముస్లింలు సోమవారం రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. రాజకీయ పార్టీలకు చెందిన నేతలు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలపడానికి పోటీలు పడ్డారు. ఈద్గా వద్ద ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వారిలో స్థానిక ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్, మాజీ మంత్రి డాక్టర్ పి.శంకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి, పురపాలిక సంఘం చైర్మన్ అగ్గనూరి విశ్వం, కాంగ్రెస్ నాయకులు వన్నాడ ప్రకాష్‌గౌడ్, ఒగ్గు కిశోర్, కట్టా వెంకటేష్‌గౌడ్, గంగనమోని సత్తయ్య, దంగు శ్రీనివాస్ యాదవ్, టిడిపి నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, కృష్ణ యాదవ్, టిఆర్‌ఎస్ నాయకులు నరేందర్, సి.రవి యాదవ్, ఎంఎస్ నటరాజ్, టౌన్ సిఐ శ్రీనివాసచారి, షాద్‌నగర్ ఆర్‌డిఓ ఎం.కృష్ణ ఉన్నారు.
కొత్తూరు: రంజాన్ పర్వదిన వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ప్రసిద్ధి చెందిన జహంగీర్ పీర్ దర్గాలో రంజాన్ వేడుకల సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. కొత్తూరు, నందిగామ మండలాలల్లోని మామిడిపల్లి, కొత్తూరు, నందిగామ, చేగూరు, మేకగూడ, నర్సప్పగూడ, రంగాపూర్ తదితర గ్రామాలలో రంజాన్ పర్వదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముస్లింలకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపేందుకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఈద్గాల వద్దకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. జడ్పీ వైస్ చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి, ఎంపిపి శివశంకర్‌గౌడ్‌తో పాటు ఈద్గా వద్దకు కొత్తూరు మండలంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు జె.వెంకట్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, ఈట గణేష్, బి.లింగం, నర్సింలు, సి.కిష్టయ్య, టి.కృష్ణయ్య, మామిడిపల్లి సర్పంచ్ శోభారెడ్డిలు వెళ్లి ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
కొందుర్గు: రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ఈద్గాల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సోమవారం కొందుర్గు మండల కేంద్రంతో పాటు పెద్దఎల్కిచర్ల, వీరన్నపేట, చౌదరిగూడెం, ఇంద్రానగర్, తుమ్మలపల్లి, వనంపల్లి, శ్రీరంగపూర్, రాంచంద్రాపూర్, ఆగిర్యాల, లాలాపేట, ఉమ్మెంత్యాల, తంగళ్లపల్లి గ్రామాలలో రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు.
కేశంపేట: రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం కేశంపేట మండల కేంద్రంతోపాటు కొత్తపేట, లేమామిడి, బోదునంపల్లి, ఎక్లాస్‌ఖాన్‌పేట, పోమాల్‌పల్లి గ్రామాలలో రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలు ఈద్గాల వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వారిలో లక్ష్మనారాయణగౌడ్, ఎస్‌ఐ శ్రీ్ధర్, యాదగిరిరావు, ప్రభాకర్‌రెడ్డి, జమాల్‌ఖాన్, మన్మధరెడ్డి, నవీన్‌కుమార్, శ్రీశైలం, పల్లె అంజయ్య, మోటే శ్రీను, ఉదయ్‌కుమార్‌గౌడ్, శేఖర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
బాలానగర్: రంజాన్ పర్వదినం సందర్భంగా ఫతేనగర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో రంజాన్ వేడుకలు ముస్లింలు జరుపుకున్నారు. స్థానిక కార్పొరేటర్ పండాల సతీష్‌గౌడ్.. ఇందిరాగాంధీపురం మజీద్, గౌతంనగర్ ఈద్గాతో పాటు పలు ప్రాంతాలలోని మజీద్‌లలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో యాసీన్, ఇమ్రాన్, గౌస్, శేఖర్, అజీజ్, ముఖ్రుదీన్, సాగర్‌రావు, దత్తారావు పాల్గొన్నారు.
బాలానగర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో మజీద్, ఈద్గాలలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వేడుకలకు బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ కాండూరి నరేంద్ర ఆచార్య పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సయ్యద్ అహ్మద్ అలి నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు హజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
చేవెళ్ల: రంజాన్ పండుగాన్ ముస్లింలు చేవెళ్లతో పాటు మండల పరిధిలోని గ్రామాలల్లో ఘనంగా జరుపుకున్నారు. నూతన వస్త్రాలను దరించి వేలాది మంది ముస్లిం సోదరులు చేవెళ్ల తహశీల్దార్ కార్యాలయం వెనుక ఉన్న ఈద్గాతో పాటు మండలంలోని అన్ని మాసీదుల్లో వద్ద సాముహిక ప్రార్థనలు చేశారు. రంజాన్ సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య శుభాకాంక్షలు తెలిపారు. చేవెళ్ల సిఐ గురువయ్య ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేకంగా బందోబస్తు నిర్వహించారు. మండలంలోని ముడిమ్యాల్, ఆలూర్, మాల్కాపూర్, గుండాల, చన్‌వళ్లి, తంగడీపల్లి, అంతారం, కౌకుంట్ల, గొల్లపల్లి తదితర గ్రామాల్లో రంజాన్ పండుగను కన్నుల పండుగా జర్పుకున్నారు.
ఘట్‌కేసర్: రంజాన్ వేడుకలను ఘట్‌కేసర్‌లో సోమవారం ఘనంగా జరుపుకున్నారు. శివారెడ్డిగూడలోని ఎస్‌విఎస్ ఫంక్షన్ హాల్‌లో రంజాన్ పండుగ సందర్భంగా మండలంలోని వేలాది ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. రంజాన్ పర్వదినం సందర్భంగా మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఎంపిపి బండారి శ్రీనివాస్‌గౌడ్, ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ బి.ప్రకాష్, ఘట్‌కేసర్ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల మహేష్‌గౌడ్, సీనియర్ నాయకులు కొమ్మిడి రాఘవరెడ్డి, సింగిరెడ్డి రాంరెడ్డి, ఎదులాబాద్ సర్పంచ్ మూసి శంకర్, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడ బైనగారి నాగరాజు, చౌదరిగూడ మాజీ సర్పంచ్ బైరు రాములు గౌడ్, మండల టిఆర్‌ఎస్ అధ్యక్షుడు బోయపల్లి కొండల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కందుల కుమార్, మండల సహకార సంఘం మాజీ చైర్మన్ సార శ్రీనివాస్‌గౌడ్, డైరక్టర్ బొక్క ప్రభాకర్‌రెడ్డి, స్కైలాబ్ రెడ్డి స్వచ్ఛంద సేవా సంస్థ చైర్‌పర్సన్ కందాడి స్కైలాబ్‌రెడ్డి, శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ డైరక్టర్ తరిణే మహింద్రాచారి, ఎంపిటిసి మేకల నర్సింగ్‌రావు, నాయకులు నోముల నవీన్ ప్రకాష్, బూడిద కృష్ణమూర్తి శుభాకాంక్షలు తెలిపారు. మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ అబ్ధుల్ ఖయూమ్, టిఆర్‌ఎస్ మండల ప్రచార కార్యదర్శి ఎండి సిరాజ్ మండలంలోని ముఖ్య నాయకులకు విందు ఏర్పాటు చేశారు.