రంగారెడ్డి
కుక్కల దాడిలో బాలుడి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
శామీర్పేట, జూన్ 26: రంజాన్ పర్వదినంను పురస్కరించుకొని ఉదయమే కొత్త బట్టలు వేసుకొని ప్రార్థన చేసి తిరిగి ఇంటికి వస్తున్న ఓ బాలుడిని కుక్కల మంద దాడి చేసి తీవ్రంగా గాయపర్చడంతో మృతి చెందిన సంఘటన శామీర్పేట మండలం మూడు చింతలపల్లి గ్రామంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... మూడు చింతలపల్లి గ్రామంలో ఇమాన్, ఖదీర్బీల దంపతుల కుమారుడు ఫారూక్ (8) సోమవారం ఉదయం రంజాన్ పండుగ సందర్భంగా నమాజ్ చేసి తిరిగి ఇంటికి వస్తుండగా గ్రామంలో ఉన్న కుక్కల మంద మాకుమ్మడిగా దాడి చేసింది. దీంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయ. దీంతో అల్లాడుతున్న ఫారూక్ను చికిత్స నిమిత్తం మొదట ఉద్దమర్రి గ్రామంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ కుక్కల దాడికి సరైన మందు లేదని చెప్పడంతో మేడ్చల్లోని మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా ఈ అబ్బాయికి చికిత్స చేయకపోగా నగరానికి తీసుకువెళ్లేందుకు 108లో తరలించి నగరంలోని ఫీవర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా చికిత్స అందించకపోగా నిలోఫర్ ఆసుపత్రికి తరలించడంతో అబ్బాయి అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రంజాన్ పండుగ సందర్భంగా వైద్యులు సరైన సమయంలో అందుబాటులో లేకపోవడంతో తమ అబ్బాయిని బతికించుకోలేక పోయామని తల్లిదండ్రులు బోరుమని విలపిస్తున్నారు.
అందుబాటులో లేని వైద్యం
విపత్కర పరిస్థితుల్లో కుక్కలు, పాములు ఇతర విష జంతువుల కాటు వేస్తే.. వీటికి మండల కేంద్రంలోని ఆసుపత్రిలో కాని ఇతర చుట్టుపక్కల గ్రామాల్లో వైద్య సదుపాయం లేదు. కొన్ని సందర్భాల్లో విష జంతువులకు బలైన మనిషి నగరంలోని పెద్దాసుపత్రులకు తరలిస్తేనే ప్రాణాలు మిగిలే అవకాశం ఉందని.. కానీ ఇతర చిన్న చిన్న ఆసుపత్రుల్లో మాత్రం చికిత్స అందడంలేదు. సోమవారం జరిగిన కుక్కల దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడితే అతనిని రక్షించేందుకు ఆ తల్లిదండ్రులు సుమారు మూడు ఆసుపత్రులను సంప్రదించినా చివరకు ఆ అబ్బాయి ప్రాణాలు మాత్రం మిగలలేదు. కేవలం కార్పొరేట్ ఆసుపత్రుల్లో లభించే ఈ వైద్యం వివిధ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఉంటే ఈ బాలుడు బతికేవాడేమోనని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పండుగలు, ఇతర సెలవు రోజుల్లో కూడా వైద్యులు సకాలంలో అందుబాటులో లేక వైద్యం సకాలంలో అందక ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఎంతో అత్యవసరమైన సమయంలో కూడా వైద్యం అందించాల్సిన డాక్టర్లు కూడా సెలవులకు వెళ్లడం, మెడిసిటీ, ఫీవర్ ఆసుపత్రి వంటి పెద్దాసుపత్రుల్లో కుక్కల దాడికి చికిత్సలకు మందులు అందుబాటులో లేవంటే వైద్యాసుపత్రుల విధి నిర్వహణకు అద్దం పడుతోంది.