రంగారెడ్డి

సమాజ సేవతోనే వ్యక్తికి గుర్తింపు: ప్రకాష్‌రాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేశంపేట, జూన్ 26: సమాజ సేవతోనే వ్యక్తికి మంచి గుర్తింపు లభిస్తుందని సినీ నటుడు ప్రకాష్‌రాజ్ వివరించారు. సోమవారం కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిలో నిరుపేద ముస్లిం చోటాజీకి నూతనంగా ఇంటిని నిర్మించి గృహప్రవేశం చేయించారు. సినీ నటుడు ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ సంపాదించడం గొప్పకాదు.. ఇతరులకు సేవ చేయడం గొప్పవిషయమని అన్నారు. కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని ప్రజలందరి సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. నిరుపేద ముస్లిం చోటాజీ ఇల్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అతనికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని గ్రామస్థులు తమ దృష్టికి తీసుకువచ్చారని వివరించారు. తక్షణమే స్పందించి ఐదు లక్షల రూపాయలతో నూతనంగా ఇంటిని నిర్మించి ఇచ్చినట్లు తెలిపారు. గ్రామంలో మరో నాలుగు నిరుపేద కుటుంబాలు ఉన్నాయని, వారందరికీ తగిన ఆర్థిక సహయం చేయనున్నట్లు వివరించారు.
ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదులను నిర్మించానని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజు, ఉప సర్పంచ్ శ్రీను, సింగిల్ విండో చైర్మన్ శంకర్, మాజీ సర్పంచ్ శేఖర్ పంతులు, వార్డు సభ్యులు లక్ష్మణ్, ఆనంద్, నాయకులు బాలీశ్వర్, ప్రకాష్‌రాజ్ ఫౌండేష్ కోఆర్డినేటర్ రమేష్, గ్రామస్థులు సంతోష్, శ్రీను, శివ, రాజు, బాలస్వామి పాల్గొన్నారు.