రంగారెడ్డి

వికారాబాద్ స్మార్ట్ సిటీకి పనికిరాదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూన్ 26: తెలంగాణ రాష్ట్రానికి దాదాపు సరిహద్దులో ఉన్న కరీంనగర్ స్మార్ట్‌సిటీగా ఎంపికైనపుడు రాష్ట్ర రాజధానికి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్ పట్టణం ఎందుకు పనికిరాదని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో వికారాబాద్ పట్టణాన్ని శాటిలైట్ టౌన్‌షిప్‌గా ఎంపిక చేశారు. చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో దేశంలోని ప్రధాన నగరాల సమీపంలోని పట్టణాలను షాడో టౌన్‌గా అభివృద్ధి చేయాలని ఏడు పట్టణాలను ఎంపిక చేశారు. అందులో హైదరాబాద్‌కు సమీపంలోని వికారాబాద్ పట్టణాన్ని షాడో టౌన్‌గా అభివృద్ధి చేయాలని శాటిలైట్ టౌన్‌షిప్ పథకానికి రూపకల్పన చేశారు. హైదరాబాద్ నగరంలో విపరీతంగా జనాభా పెరిగిన దరిమిలా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సమీప పట్టణంలో నివాసం, రవాణా, మంచినీటి వసతులు కల్పించి గంటలో హైదరాబాద్‌కు చేరుకునేలా వసతులు, సౌకర్యాలను అభివృద్ధి చేయడమే శాటిలైట్ టౌన్‌షిప్ పథకం. పథకం రూపకల్పన చేసిన సమయంలో నిధులు అనంతమని, 2020 వరకు ఉంటుందని సంబంధిత శాఖ కన్సల్టెన్సీలు అవగాహన సదస్సుల్లో భాగంగా చెప్పారు. ఎట్టకేలకు వికారాబాద్ పట్టణానికి భూగర్భ డ్రైనేజీ, మంజీరా నీటి పథకాన్ని దాదాపు 140 కోట్ల రూపాయలతో చేపట్టారు. ఆ తర్వాత నిధులు మంజూరు కావడం గాని పనులు చేపట్టడం గాని జరగలేదు. ఆతర్వాత ప్రభుత్వాలు మారడంతో వికారాబాద్ శాటిలైట్ టౌన్‌షిప్ పథకం కనుమరుగైపోయింది. అప్పటి ప్రభుత్వం ప్రకటన ప్రకారం పథకం గురించి ఈ ప్రాంతం నుండి ప్రాతినిథ్యం వహించేవారు వాకబు చేసిన దాఖలాలు లేవు. కనీసం ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న స్మార్ట్‌సిటీ జాబితాలోనైనా వికారాబాద్ ఉందా అంటే అదీలేదు. వికారాబాద్ పట్టణానికి లేని అర్హతంటూ లేదు. వికారాబాద్ జిల్లా కేంద్రమే కాకుండా, ముంబాయికి వెళ్ళే మార్గంతో రైల్వే జంక్షన్ ఉంది. అటు ముంబాయి, ఇటు బెంగుళూరు హైవేలు 35 నుండి 70 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. హైదరాబాద్ నగరం నుండి 70 కిలోమీటర్ల దూరం ఉన్నా ఇటు అప్పా, అటు నాగులపల్లి రింగ్ రోడ్డు నుండి రోడ్లను అభివృద్ధి చేస్తే వికారాబాద్‌కు 45 నిమిషాల్లో చేరుకోవచ్చు. జిల్లా కేంద్రంలో ఇప్పటికే జిల్లా పోలీసు కార్యాలయం నిర్మాణమై ఉండగా, జిల్లా గ్రంథాలయ సంస్థ, డిగ్రీ, జూనియర్ కళాశాలలు, ఇంటర్నేషనల్ పాఠశాలలు, స్వచ్ఛమైన గ్రామీణ వాతావరణం ఉన్నాయి.
వసతులు, సౌకర్యాలు, వనరులున్నా వికారాబాద్ జిల్లా, పట్టణంపై ప్రభుత్వం, పాలకులు ఎందుకు వివక్ష, నిర్లక్ష్యం చూపుతున్నారని ప్రశ్నిస్తున్నారు. సిఎం కెసిఆర్, కెటిఆర్, హరీష్‌రావు, కవితలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నారా? లేక మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ జిల్లాలనే పాలిస్తున్నారా? అనే అనుమానాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడు సంవత్సరాలు గడుస్తున్నా వికారాబాద్ జిల్లా వైపు సిఎం కనె్నత్తి చూడటం లేదని, ఇక్కడి రైతులకు, నిరుద్యోగులకు ప్రభుత్వం చేసిందేమీ లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వికారాబాద్ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఉపాధి కల్పిస్తే ఇక్కడి ప్రజలు కెసిఆర్ కుటుంబానికి రుణపడి ఉంటారని ప్రజలు కోరుతున్నారు.