రంగారెడ్డి

హరితహారానికి కోటి 35 లక్షల మొక్కలు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూన్ 26: హరితహారం కింద నాటేందుకు వికారాబాద్ జిల్లాలో కోటి 35 లక్షల మొక్కలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే జిల్లాకు ఇచ్చిన కోటి 43 లక్షల మొక్కల ఉత్పత్తి లక్ష్యాన్ని అటవీశాఖ పూర్తి చేసింది. జిల్లాలో మొత్తం 95 నర్సరీలుండగా అందులో ఎనిమిది ప్రభుత్వానివి కాగా, 76 అటవీశాఖకు చెందిననవి, 21 జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థకు చెందినవి. అటవీ ప్రాంతంతో పాటు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, రహదారుల వెంట, ప్రైవేటు సంస్థల వద్ద నాటేందుకు వీలుగా అనేక రకాల మొక్కలను సిద్ధం చేశారు. వాటిలో వేప, టేకు, మర్రి, రావి, అశోక, నెమలినార, ఇప్ప, ఆర, గుమ్మటాకు, బాంబు, మారేడు, గుల్‌మొహార్, తెల్లమద్ది, బహునియా, కానుగ, మోదగ, ఉసిరి, గోరింటాకు, బొప్పాయి, చింత, జామ, తుమ్మ ఉన్నాయి.
హరితహారంపై జరగని మంత్రి సమీక్ష
హరితహారంలో భాగంగా జూలై ఒకటో తేదీ నుంచి మొక్కలు నాటే కార్యక్రమం సమీపిస్తున్నా వికారాబాద్ జిల్లా హరితహారంపై ఇంకా మంత్రి సమీక్ష జరగలేదు. గత రెండేళ్ళుగా రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న, జిల్లాకు చెందిన మంత్రి మహేందర్‌రెడ్డితో వచ్చి హరితహారంపై అనంతగిరి హరిత రిసార్ట్స్‌లో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించేవారు. జూన్ నెల మొదటి వారంలో మంత్రి జోగు రామన్న పర్యటన వికారాబాద్ జిల్లాలో ఉండగా పలు కారణాలచే రద్దయింది. అప్పటి నుండి మరలా పర్యటన ఖరారు కాలేదు. హరితహారం మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతం కావాలంటే మంత్రి సమీక్ష జరిగితేనే బాగుంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. మరి మంత్రి సమీక్ష నిర్వహిస్తారో? లేదో? వేచి చూడాల్సిందే.