మెదక్

మైనార్టీల అభ్యున్నతికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూన్ 26: మైనార్టీల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎక్బాల్‌మినార్ సమీపంలోని సూఫియా దర్గా వద్ద ఎర్పాటు చేసిన వేదిక వద్ద ముస్లీంలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా ముస్లీం మైనార్టీల అభ్యున్నతి కోసం సిఏం కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. విద్యాభివృద్ధితో పేదరికం దూర మవుతుందన్నారు. ముస్లీంల పేదరిక నిర్మూలనలో భాగంగా రాష్టవ్య్రాప్తంగా 200 మైనార్టీ రెసిడెన్సియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు. రాష్టవ్య్రాప్తంగా 4లక్షల మంది ముస్లీంలకు రంజాన్ వేడుక కోసం నిత్యవసర సరుకులు, బట్టలు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే ప్రభుత్వ పక్షాన అన్ని చోట్ల ఇప్తార్ విందులు ఎర్పాటు చేయడం జరిగిందన్నారు. ముస్లీం మైనార్టీల సంక్షేమంలో భాగంగా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు సర్కార్ 20లక్షలు రూపాయల అర్థిక సహాయం అందచేస్తుందన్నారు. ముస్లీంలకు ఇచ్చిన హామీ మేరకు 12 శాతం రిజర్వేషన్లు కట్టుబడి ఉన్నారని,క్యాబినెట్ ఆమోదం చేసి కేంద్రానికి పంపినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఐక్యమత్యంతో కలసి మెలసి ఉండేలా ఇప్తార్ విందును తెలంగాణ సర్కార్ ప్రారంభించిందన్నారు. రంజాన్ పండుగ పవిత్రకు, త్యాగానికి చిహ్నామని పండుగను భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సహాలతో జరుపుకోవటం సంతోషంగా ఉందన్నారు. సిద్దిపేట మతసామరస్యానికి ప్రతిక అన్నారు. ఇక్కడ హిందు, ముస్లీంలు కలసి మెలసి సోదరభావంతో మెలగుతారన్నారు. హిందూవుల పండుగల్లో ముస్లీంలు, ముస్లీంల పండుగల్లో హిందూవులు కలసి పాలుపంచుకుంటారన్నారు. ఇదే సంప్రదాయాన్ని భవిష్యత్తులో కొనసాగించాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్, ముస్లీం మత పెద్దలు, కౌన్సిలర్లకు మంత్రి హరీష్‌రావు అలాయ్‌బలాయ్ తీసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.