అనంతపురం

పురంలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, జూన్ 26:లేపాక్షి మండలం కులమద్ది సమీపంలో పేకాట జూదమాడుతున్న సమాచారం అందుకున్న ఎస్‌ఐ శ్రీ్ధర్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహించిన పలువురిని ఆదుపులోకి తీసుకున్నారు. ఇందులో బాగంగా కులమద్దికి చెందిన ఉప్పర రమేష్‌ను పట్టుకోవడంతో పాటు చేయి చేసుకోగా తీవ్రంగా గాయపడ్డాడు. రమేష్‌తోపాటు ఆటోలో లేపాక్షి పోలీసుస్టేషన్‌కు తీసుకుపోగా అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు బాధిత వర్గాలు తెలుపుతున్నాయి. అయితే పోలీసులు ఓ ఆర్‌ఎంపి డాక్టర్‌ను పిలిపించి పోలీసుస్టేషన్‌లో వైద్య చికిత్స చేయించగా అప్పటికే మృతి చెందినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో హిందూపురం ప్రభుత్వాసుపత్రికి ఉప్పర రమేష్‌ను తరలించగా మృతి చెందాడు. సోమవారం రాత్రి బాధిత కుటుంబ సభ్యులు పెద్దఎత్తున హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలివచ్చి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందలో భాగంగా ఆసుపత్రి ఎదుట ప్రధాన రహదారిపై పుష్పలతతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. ఓ సందర్భంగా మృతిని భార్య సృహకోల్పొవడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. పేకాట ఆడితే కోర్టులో హాజరుపరచాలి తప్పా ఇంత ఘోరంగా శిక్షించడం ఎందుంకంటూ బాధితులు పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం రమేష్‌కు వివాహంకాగా పోలీసుల వైఖరికారణంగా మృతిచెందాడని ఆరోపించారు. ప్రస్తుతం రమేష్ మృతి దేహం ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉంది. మంగళవారం అనంతరం పోస్టుమార్టం అనంతరం పరిస్థితి ఎలా ఉంటుందోనన్నది వేచిచూడాలి.