అనంతపురం

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, జూన్ 26: దేశంలో 1975 జూన్ 25వ తేదీన ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేసిందని అత్యాయిక పరిస్థితులకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్న సంధ్యావందనం బద్రీనాథ్, బిజెపి జిల్లా అధ్యక్షుడు జె.అంకాల్‌రెడ్డిలు పేర్కొన్నారు. దేశంలో అత్యాయిక పరిస్థితి విధించి నేటికి 42 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బిజిపి జిల్లా కార్యాలయంలో ప్రజాస్వామానికి చీకటి రోజులు అన్న అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1975 జూన్ 25వ తేదీన అర్థరాత్రి నాటి ప్రధాని ఇందిరాగాంధీ మంత్రి వర్గంలోని హోం మంత్రికి కూడా తెలియకుండా రాజ్యాంగంలోని 352/1 ఆర్టికల్ ద్వారా రాష్టప్రతి అంతర్గత అత్యాయిక పరిస్థితిని విధించి ప్రజాసామ్యాన్ని ఖూనీ చేసి దాన్ని వ్యతిరేకించిన వారిని దేశంలో అనేకమందిని జైలుపాలు చేసిందన్నారు. ప్రపంచ దేశాల ముందు పరువు పోగొట్టుటకు కారణమైందన్నారు. దేశంలోని అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో ఉంచుకోవడానికి నియంతృత్వ ధోరణితో ఈ చర్యకు పూ నుకొందన్నారు. అనంతరం సంధ్యావందనం బద్రీనాథ్‌ను బిజెపి నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, నగర అధ్యక్షు డు శ్రీనివాసులు, మలిశెట్టి పెద్దన్న, అదిలక్ష్మమ్మ, రత్నమ య్య, రూప, మల్లీశ్వరీ, రమేష్, నాయకులు పాల్గొన్నారు.