చిత్తూరు

తిరుపతిలో కన్నుల పండువగా రంజాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 26: రంజాన్ పండుగను పురస్కరించుకొని తిరుపతి ఈద్గామైదానంలో సోమవారం ముస్లింలు కన్నుల పండువగా భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ ఎంపి చింతామోహన్, కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జ్ మబ్బుదేవనారాయణ రెడ్డి, పిసిసి కార్యదర్శులు వెంకటనరసింహులు, నయనార్ శ్రీనివాసులు, టిడిపి ఆరోగ్యవిభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి, నాయకులు సూరా సుధాకర్‌రెడ్డి, మనె్నం శ్రీనివాసులు ప్రార్థనాస్థలాలకు వెళ్లి ముస్లింలతోపాటు ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలోనే ముస్లింలకు మేలు జరిగిందన్నారు. ముస్లింల సంక్షేమం కోసం అనేక పథకాలను ఆయన ప్రవేశపెట్టారని వివరించారు. ఇందులో భాగంగానే రంజాన్‌తోఫాను అందజేశారన్నారు.
ముస్లిం మైనార్టీలను అన్నివిధాలా ఆదుకోవాలి: చింతామోహన్
దేశంలోని ముస్లిం మైనార్టీ ప్రజలు విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో అత్యంత వెనుకబడి ఉన్నారన్నారని డాక్టర్ చింతామోహన్ అన్నారు. దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది ముస్లింలున్నారని, వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరం స్పందించి ముస్లిం మైనార్టీ ప్రజలకు తగిన ప్రోత్సాహం అందించి ఆదుకోవాలన్నారు. స్వాతంత్య్ర భారతదేశంలో ముస్లింలు అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్నారు. మైనార్టీ కార్పొరేషన్‌కు అధిక నిధులు కేటాయించి, వివిధ బ్యాంకులు ఉదార స్వభావంతో ముందుకొచ్చి విరివిగా రుణాలు ఇచ్చి, నిరుపేద నిరుద్యోగులను ఆదుకోవాలన్నారు. రాష్ట్రంలో, దేశంలోమైనార్టీల సంక్షేమం దృష్ట్యా ప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి వాటి పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. మైనార్టీ వర్గాలకు చెందిన పిల్లలు నేటి సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే అందుకు విద్యప్రధానమన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించి, తల్లిదండ్రుల ఆకాంక్షలు, ఆశయాలను నెరవేర్చాలన్నారు. ముస్లిం సోదరులకు అత్యంత పర్వదినమైన రంజాన్ పండుగ సందర్భంగా సోమవారం స్థానిక ఈద్గా మైదానంలో ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో చింతామోహన్ పాల్గొన్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులు పూతలపట్టు ప్రభాకర్, నైనారు శ్రీనివాసులు, వెంకటనరసింహులు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.