చిత్తూరు

శివరాత్రిని తలపించిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కాళహస్తి, జూన్ 26: శ్రీ కాళహస్తీశ్వరాలయంలో భక్త సందడి సోమవారం మహాశివరాత్రిని తలపించింది. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లు నిండిపోయాయి. సోమవారం కావడంతో అభిషేకాలు చేయించుకోవాడానికి, రాహు-కేతు పూజలు చేయించుకోవడానికి ఎంతో మంది భక్తులు వచ్చారు. భక్తుల రద్దీకి తోడు అభిషేకాలకు రద్దీ మరింత పెరగడంతో దర్శనం మరింత ఆలస్యమైంది. స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం సుమారు 5 గంటలకుపైగా భక్తులు క్యూలోవేచి ఉండాల్సివచ్చింది. క్యూలైన్లు నిండిపోయి భిక్షాల గాలిగోపురం దాటి బజారు వీధిలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి గుడి వరకు క్యూలైన్ భక్తులు బారులు తీరారు. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. గంట తరువాత వర్షం పడింది. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం క్యూలో ఉన్న భక్తులందరికీ దేవస్థానం సిబ్బంది మంచినీళ్లు సరఫరాచేశారు. రాహు-కేతు పూజలు అయిన తరువాత ఒకేసారి క్యూలైన్‌లోకి వెళ్లడంతో తోపులాటలు కూడా జరిగాయి. సాయంత్రం వరకు 5వేలకుపైగా రాహు-కేతు పూజలు జరిగాయి. అంతేకాకుండా 50 వేలకుమందిపైగా భక్తులు స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలోనేకాకుండా ఆలయ ఆవరణ, బయటకూడా భక్తులు తప్పిపోయారు. మధ్యాహ్నం తరువాత వర్షం జల్లులు జల్లులుగా పడుతుండటంతో భక్తులు ఇబ్బందులుపడ్డారు. రాత్రి వరకు రద్దీ కొనసాగిస్తూ ఆదివారం నుంచి రద్దీ ఉండగా సోమవారానికి మరింత పరిగింది. సోమవారం రంజాన్ కావడంతో భక్తుల రద్దీ పెరగడానికి కారణమయింది. దీంతో సన్నిధివీధిలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.